https://oktelugu.com/

ట్రైలర్ టాక్: స్వామీజీల ఆటకట్టించే ‘అమ్మోరు తల్లి’

కరోనా వైరస్ రాక ఓ రకంగా సగటు ప్రేక్షకుడికి మేలే చేసింది. వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలను డబ్ చేస్తూ అన్ని భాషల ప్రేక్షకులు చూసేలా ఓటీటీలు ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా తమిళనాట రూపొందిన ‘అమ్మోరు తల్లి’ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి వచ్చేనెల 14న ఓటీటీ ద్వారా రిలీజ్ కు రెడీ అయ్యింది. దీపావళికి ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ కాబోతోంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం […]

Written By: , Updated On : October 28, 2020 / 05:16 PM IST
Follow us on

Nayanatara Ammoru Thalli

కరోనా వైరస్ రాక ఓ రకంగా సగటు ప్రేక్షకుడికి మేలే చేసింది. వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలను డబ్ చేస్తూ అన్ని భాషల ప్రేక్షకులు చూసేలా ఓటీటీలు ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా తమిళనాట రూపొందిన ‘అమ్మోరు తల్లి’ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి వచ్చేనెల 14న ఓటీటీ ద్వారా రిలీజ్ కు రెడీ అయ్యింది. దీపావళికి ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ కాబోతోంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Also Read: కరీనాకు గర్భం కూడ అడ్డుకాలేదు.. సోషల్ మీడియాలో వైరల్

మతం, భక్తి పేరుతో కొందరు వ్యాపారం చేసే బాబాలు, స్వామీజీల ఆట కట్టించేందుకు వచ్చే మోడ్రన్ అమ్మవారుగా నయనతార నటించారు. ఒక పేద ఫ్యామిలీకి సాక్ష్యాత్కారించి వారిని గొప్ప ధనవంతులుగా మార్చి స్వామీజీల ఆటకట్టించడం అసలు కథ.

అమ్మోరు తల్లి ప్రత్యక్షమైన ఆమె నిజమైనదా కాదా అని ఆ ఫ్యామిలీ పరీక్షలు పెట్టడం.. పలు కామెడీ సీన్లతో సినిమా నవ్వులు పూయించేలా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్తమవుతోంది.

Also Read: తేజ్ ఎందుకు టెంప్ట్ అయ్యాడో ఇప్పుడు తెలిసింది

దేవుడు ఉన్నాడనేవారు మరో దేవుడు నిజం కాదు అంటూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వారిపై అమ్మోరు ఎలా రివేంజ్ తీర్చుకుందనేది ఫన్నీగా చూపించారు.

Ammoru Thalli | Official Telugu Trailer | RJ Balaji | Nayanthara | Streaming from November 14