Homeఅత్యంత ప్రజాదరణతండ్రిని.. అన్నను తలుచుకొని నాగబాబు ఎమోషనల్

తండ్రిని.. అన్నను తలుచుకొని నాగబాబు ఎమోషనల్

Nagababu

మెగా బ్రదర్ నాగబాబు టాలీవుడ్లో నటుడిగా.. నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగబాబు ప్రస్తుతం వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై తనదైన ముద్ర వేస్తున్నారు. జబర్దస్త్ షోలోగా జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఆ షో విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం జీ తెలుగులో ‘బొమ్మ అదిరింది’ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కూడా బుల్లితెరపై టీఆర్పీలో దూసుకెళుతుంది.

Also Read: ఆర్.ఆర్.ఆర్ లో ఆ ఇద్దరు ఉంటారా?

మెగా ఫ్యామిలీ ఇంటా మరోసారి పెళ్లి సందడి నెలకొంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో నిహారికకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 9న రాత్రి 7.15గంట‌ల‌కు నిహారిక-చైతన్యల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే పెళ్లి తంతు మాత్రం హైదరాబాద్లో కాకుండా రాజస్థాన్లో నిర్వహిస్తున్నారు. దీంతో మెగా అభిమానులు రాజస్థాన్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు తన తండ్రి.. అన్న.. కూతురును తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి పిల్లల విషయంలో ఎలా వ్యవహరించారో చెబుతూనే ఈతరం తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలో పలు సూచనలు చేశారు. మా నాన్న మా కోరికలు.. ఆలోచనలకు గౌరవిస్తూనే మార్గనిర్దేశనం చేసేవారని తెలిపారు. అలాగే అన్నయ్య కూడా తాను జీవితంలో స్థిరపడటానికి.. నిర్మాతగా మారడానికి కారణమని చెప్పారు. అయితే స్వతంత్ర్యంగా ఎదగాలంటూ సూచించేవారని మెగాబ్రదర్ చెప్పుకొచ్చాడు.

Also Read: ఓటీటీకి పోటీగా వస్తున్న ఏటీటీలు..!

ఈతరం తల్లిదండ్రులు పిల్లలను మరీ గారబంగా పెంచుతుండటంతో వారికి కావాల్సిన స్వేచ్ఛ దొరకడం లేదన్నారు. అర్థంలేని భయాలతో వాళ్ల ఆలోచనలను మొగ్గలోనే తుంచడం భావ్యం కాదన్నారు. పిల్లలను ప్రతీయేటా విహారయాత్రలకు తీసుకెళ్లాలని.. అప్పుడే వారిలోని నైపుణ్యం మనకు తెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తల కోసం: సినిమా

తల్లి ఎప్పుడు పిల్లలతోనే ఉంటుందని.. తండ్రి అనేవాడు రోజులో కనీసం ఒక గంటైనా పిల్లలతో సమయం గడపాలన్నారు. అప్పుడే పిల్లల్లో దాగివున్న సృజనాత్మకను గుర్తించగలరని తెలిపారు. పిల్లలను కొంచెం రఫ్ గా పెంచాలని అప్పుడే వాళ్లు తమకు ఎదురైన సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారని నాగబాబు చెప్పారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular