చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు నాగబాబు. ‘రాక్షసుడు’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయిన మెగా బ్రదర్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. అనంతరం నిర్మాతగా మారి, పలు చిత్రాలు నిర్మించారు. ‘ఆరెంజ్’ సినిమాతో భారీ నష్టాల్లో కూరుకుపోయారు. తాను చూసుకుంటానని మెగాస్టార్ చెప్పడంతో అంతా సెట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. పవన్ కూడా తన అన్న కోసం చాలా ఖర్చు చేశాడని చెబుతుంటారు.
అయితే.. జబర్దస్త్ జడ్జిగా వచ్చిన ఆయన చాలా కాలం అందులో ఉన్నారు. ఆ తర్వాత మరో షోకు వెళ్లారు. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అడపాదడపా చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అయితే.. ఏ విషయంపైనైనా కుండబద్ధలు కొట్టినట్టుగా తన అభిప్రాయం చెప్పేసే నాగబాబు.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తరూ టచ్ లో ఉంటున్నారు.
ఈ మధ్య విరివిగా క్వశ్చన్ అవర్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే.. ఓ నెటిజన్ ‘ఎంత ఆస్తి ఉంది నీకు’ అని అడిగాడు. దీనికి నాగబాబు హర్ట్ అయినట్టున్నారు. ‘నువ్వు అని సంబోధించావు. అంటే నీకు రెస్పెక్ట్ తగ్గిపోయింది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పను.’ అన్నారు. అంతేకాదు.. ‘మీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగితే చెప్పేవాడిని.. అంతేకాదు, అందులో నీకు సగం ఇచ్చేవాడిని కూడా. బ్యాడ్ లక్’ అంటూ కౌంటర్ వేశాడు.
ఇక, ఇదే సెషన్లో మరో నెటిజన్.. మీరు ఉండే ఇంటి ఖరీదు ఎంత? 50 కోట్లు ఉంటుందా? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సైతం తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘ముఖేష్ అంబానీ ఇంటికన్నా కేవలం పది రూపాయలు తక్కువ అంతే. మిగిలిందంతా సేమ్ టూ సేమ్’. అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఈ డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.