https://oktelugu.com/

మూవీ రివ్యూ: ‘అన‌గ‌న‌గా ఓ అతిథి’.. హిట్టా? ఫ్లాపా?

దురాశ దుఃఖానికి చేటు అని మనం చిన్నప్పుడు కథల్లో చదువుకొని ఉంటాం.. ఆ అంశాన్నే బేస్ చేసుకొని ‘అనగననగా ఓ అతిథి’ వెబ్ మూవీ తెరకెక్కింది. ఆర్ఎక్స్-100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్.. చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అనగనగా ఓ అతిథిగా పూర్తిగా ఓటీటీ ప్రేక్షలను దృష్టిలో ఉంచుకొనే దర్శకుడు దయాల్ పద్మనాభన్ తెరకెక్కించాడు. ‘ఆహా’లో తాజాగా రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..! Also Read: బిగ్ బాస్ 4: ఈవారం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 2:45 pm
    Follow us on

    anaganaga o athidi Rating
    దురాశ దుఃఖానికి చేటు అని మనం చిన్నప్పుడు కథల్లో చదువుకొని ఉంటాం.. ఆ అంశాన్నే బేస్ చేసుకొని ‘అనగననగా ఓ అతిథి’ వెబ్ మూవీ తెరకెక్కింది. ఆర్ఎక్స్-100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్.. చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అనగనగా ఓ అతిథిగా పూర్తిగా ఓటీటీ ప్రేక్షలను దృష్టిలో ఉంచుకొనే దర్శకుడు దయాల్ పద్మనాభన్ తెరకెక్కించాడు. ‘ఆహా’లో తాజాగా రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..!

    Also Read: బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?

    అనగనగా ఓ అతిథి మూవీ థిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఓ మూవీలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా చెప్పాడు. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. దర్శకుడు సినిమాను వైవిధ్యంగా చూపించగలిగాడు. కెమెరామెన్ పనితనం బాగుంది. సంగీతం పర్వాలేదనించింది. తక్కువ బడ్జెట్లో సినిమాను నిర్మించినా నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు.

    సినిమా కథ విషయానికొస్తే.. ఊరి చివ‌ర‌న ఉండే ఇంట్లో ఓ కుటుంబం నివాసిస్తుంటుంది. ఓ తండ్రి.. ఓ కూతురు.. ఓ తల్లి అందులో ఉంటారు. త‌ల్లి మంత్ర‌సానికాగా తండ్రి తాగుబోతు.. వాళ్ల కూతురు పేరు మ‌ల్లి(పాయల్ రాజ్ పుత్). పెళ్లీడుకొచ్చిన ఆమె మ‌న‌సు నిండా ఏవో ఆశ‌లు ఉంటాయి. వాళ్ల తల్లిదండ్రులకు ఓ అయ్య చేతిలో పెట్టే ప‌రిస్థితి లేదు. ఇక ఆమెపై అప్పుచ్చిన షావుకారు కన్నేస్తాడు.

    ఇలాంటి సమయంలోనే వారికి ఓ అతిథి వస్తాడు. త‌న పేరు శ్రీ‌ను(చైతన్య కృష్ణ). అతడి దగ్గర బోలెడంత డబ్బులుంటాయి. సాయంత్రానికి కోడికూర వండి పెడ‌తారా అని అతిథి నోరారా అడుగుతాడు. అయితే అతిథి దగ్గర డబ్బులు చూడగానే ఆ ఇంట్లోవాళ్లకు ఆశ పుడుతుంది. అతిథిని చంపేస్తే ఆ డబ్బు కాజేస్తే సెటిల్ కావచ్చనే దురాశ ఫుడుతుంది. ఆ త‌ర‌వాత ఏం జ‌రిగిందనేది సినిమా.

    Also Read: 20 ఏళ్ల కిందట.. రాజమౌళి ‘బాహుబలి’ కథ సీక్రెట్ తెలిసింది

    ఈ మూవీలో పాయల్ రాజ్ ఫుత్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ‌ల్లి పాత్ర‌కు పాయల్ రాజ్ ఫుత్ న్యాయం చేసింది. చైత‌న్య కృష్ణ త‌నలోని నటనంతా ఈమూవీలో చూపించాడు. అలాగే త‌ల్లిదండ్రుల పాత్రల్లో నటించిన నటీనటులు కూడా బాగానే ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ కొంచెం స్లోగా సినిమా నడవడం కొంచెం మైనస్ గా మారింది. మొత్తానికి అనగనగా ఓ అతిథిగా ఓటీటీ ప్రేక్షలను అలరించడం ఖాయమనే టాక్ తెచ్చుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్