
టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్మీ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్ చేసిన ఆమె టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటోంది. నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మీ తండ్రి మోహన్ బాబు ప్రమేయం లేకుండా సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
Also Read: బిగ్ బాస్-4: నాగార్జునను ట్రోల్ చేస్తున్న అభిఫ్యాన్స్.. ఎందుకంటే?
కాగా ఇటీవల మంచు లక్ష్మి చేసిన హాట్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకూ ఓ లవ్ స్టోరీ ఉందని, ఆ లవర్ కు వివాహమైతే తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
మంచులక్ష్మీ సినిమా పరిశ్రమలోకి వచ్చి చాలా ఏళ్లయింది. మొదట్లో సినిమాలంటే పిచ్చి ఉన్న లక్ష్మికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టమట. అమీర్ ఖాన్ కు మొదటిసారి పెళ్లయినప్పుడు తాను ఇంట్లో కూర్చొని ఏడ్చేసిందట. తనకు అమీర్ దక్కకుండా పోతున్నాడని విలవిల కన్నీళ్లు పెట్టుకుందట. అమీర్ ఖాన్ కు రెండో సారి వివాహం జరిగినప్పుుడు కూడా ఈ విధంగానే బాధపడిందట.
Also Read: ‘ఆదిపురుష్’లో కాస్ట్ కటింగ్.. మూవీపై ఎఫెక్ట్ పడుతుందా?
ఇక టాలీవుడ్ లో నాగార్జున అంటే చాలా ఇష్టమని మంచు లక్ష్మి చెప్పింది. అయితే ఇంతమంది ముందు తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయానని పేర్కొంది. దీంతో సినిమా పరిశ్రమలో మంచు లక్ష్మీ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్