గత రెండుమూడురోజులుగా టాలీవుడ్లో విజయ్ దేవరకొండ వర్సస్ వైబ్ సైట్స్ ఇష్యూ నడుస్తోంది. విజయ్ దేవరకొండ తనపై కొన్ని వెబ్ సైట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడుతూ ఓ వీడియో చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఆయనకు మద్దుతగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకం అవుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున, హీరోయిన్లు రాశిఖన్నా, కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక, ఛార్మి, రవితేజ, అల్లరి నరేష్ తదితరులు విజయ్ కు అండగా ఉంటామని ప్రకటించారు. తాజాగా విజయ్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మద్దతు ప్రకటించింది.
మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)
ఈసందర్భంగా ‘మా’ యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. మిడిల్ క్లాస్ ఛారిటీ పేరిట విజయ్ దేవరకొండ ఓ ఛారిటీ పెట్టి విరాళాలతో పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారని తెలిపారు. అదేవిధంగా ‘సీసీసీ మనకోసం’కు కూడా విరాళం అందించినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న విజయ్ పై కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నేను వారిని నిలదీస్తున్నా.. అసలు మీరెవరు? ఎవరకీ సాయం చేయాలన్నది తమ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కొన్ని వెబ్ సైట్లు చేసే నిరాధార ఆరోపణలు తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే సహించింది లేదని విజయ్ దేవరకొండ మేమంతా మద్దతుగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!
అదేవిధంగా చిత్రపరిశ్రమకు సినీ జర్నలిస్టులకు, వెబ్ సైట్లకు ఇంటర్ లింకింగ్ ఉంటుందని తెలిపారు. అందరూ అన్నదమ్ముల్లా.. ఒక ఫ్యామిలీగా ఉండాలన్నారు. చిత్రపరిశ్రమకు మీడియా అండ ఉండాలని.. అంత మాత్రనా లేనిపోని వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. తాజాగా విజయ్ దేవరకొండకు జరిగినట్లు మరేవరికీ జరిగినా తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.