రైతును రాజుగా బతకనివ్వండి.. బానిసగా మార్చొద్దు: పీపుల్స్ స్టార్

కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన మూడు కొత్తచట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు 12రోజులుగా ఢిల్లీలో నిరసన చేపడుతున్నారు. ఓవైపు కేంద్రానికి రైతుల మధ్య చర్చలు జరుగుతుండగానే రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. Also Read: వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభామా.. నష్టమా? పంజాబ్ రైతులతో మొదలైన ఉద్యమం క్రమంగా హర్యానా.. యూపీ రాష్ట్రాలకు పాకింది. వణికించే చలిలోనూ రైతులు నిరసనలు చేపడుతుండటంతో రైతులకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించడంతో […]

Written By: Neelambaram, Updated On : December 8, 2020 4:43 pm
Follow us on

కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన మూడు కొత్తచట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు 12రోజులుగా ఢిల్లీలో నిరసన చేపడుతున్నారు. ఓవైపు కేంద్రానికి రైతుల మధ్య చర్చలు జరుగుతుండగానే రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

Also Read: వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభామా.. నష్టమా?

పంజాబ్ రైతులతో మొదలైన ఉద్యమం క్రమంగా హర్యానా.. యూపీ రాష్ట్రాలకు పాకింది. వణికించే చలిలోనూ రైతులు నిరసనలు చేపడుతుండటంతో రైతులకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించడంతో ఇదికాస్తా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. నేడు రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

నేటి భారత్ బంద్ పై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి తనదైన శైలిలో స్పందించారు. అందరికీ అన్నం పెట్టే రైతును రాజునే బతకనివ్వండి.. బానిసగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ సంస్థలకుు కొమ్మకాస్తూ తీసుకొచ్చిన చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని నారాయణమూర్తి డిమాండ్ చేశారు.

Also Read: భారత్ బంద్ విజయవంతం.. అనుహ్యంగా రాత్రి 7గంటలకు చర్చలు..!

రైతులు చేపట్టిన భారత్ బంద్ కు నారాయణమూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రధాని మోదీ సైతం అమలు చేయాలని కోరారు. ఎం.ఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్