పవన్ కళ్యాణ్ సరసన అందాల రాక్షసి

గత కొంత కాలంగా సరైన ఛాన్స్ లు లేవని.. సక్సెస్ అందని ద్రాక్ష అయ్యిందని తెగ కలత చెందుతోంది లావణ్య త్రిపాఠి. ఇక లాభం లేదు.. మన వంతు ప్రయత్నం గట్టిగా చేయాల్సిందేనని నిర్ణయించుకుంది. గ్లామర్ డోస్ పెంచాలని అనుకొంటోంది. అలాంటి సమయంలో వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ వచ్చింది. రెండేళ్ల గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎం సి ఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ‘వకీల్ […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 11:37 am
Follow us on

గత కొంత కాలంగా సరైన ఛాన్స్ లు లేవని.. సక్సెస్ అందని ద్రాక్ష అయ్యిందని తెగ కలత చెందుతోంది లావణ్య త్రిపాఠి. ఇక లాభం లేదు.. మన వంతు ప్రయత్నం గట్టిగా చేయాల్సిందేనని నిర్ణయించుకుంది. గ్లామర్ డోస్ పెంచాలని అనుకొంటోంది. అలాంటి సమయంలో వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ వచ్చింది.

రెండేళ్ల గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎం సి ఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం హీరో ఫ్లాష్ బ్యాక్ మినహా షూట్ మొత్తం పూర్తి చేసుకుంది.

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కథానాయకిగా మొడటి నుండి శృతి హాసన్ పేరు పరిశీలనలో ఉంది. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి పేరు కూడా తెరపైకి వచ్చింది మధ్యలో ఇలియానా పేరు బయటికి వచ్చినా అది రూమర్ అని తెలిసింది.. ఒకవేళ ఈ చిత్రం లో లావణ్య త్రిపాఠి కి గనుక ఛాన్స్ దొరికితే ఆమె కెరీర్ ఇక గాడిలో పడినట్టే అనుకోవాలి. ఇక వరుస సినిమా అవకాశాలు ఆమెని వెతుక్కొంటూ వస్తాయి.
Patience is bitter but its fruits are sweet