ప్రజలపై అన్ని చార్జీల భారం పెంచనున్న కేసీఆర్

టీఆర్ఎస్ హయాంలో ఏం ఛార్జీలు పెంచలేదని,కాంగ్రెస్  హయాంలోనే ఛార్జీలు విపరీతంగా పెంచారని విమర్శలు కురిపిస్తూ ప్రజలపై మోయరాని భారం మోపనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులమయం కావించిన కేసీఆర్ తన ఆర్ధిక నిర్వహణ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక్కటొక్కటిగా ప్రజలపై బండెడు భారం మోపడానికి సిద్దపడుతున్నారు. మునిగిపోయే దశలో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీలు పెంచామని సమర్ధించుకోవడం తెలిసిందే. పెంచిన ఛార్జీలతోనే బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించామని సూచించారు. ఆర్టీసీని మళ్లీ లాభాల […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 5:05 pm
Follow us on

టీఆర్ఎస్ హయాంలో ఏం ఛార్జీలు పెంచలేదని,కాంగ్రెస్  హయాంలోనే ఛార్జీలు విపరీతంగా పెంచారని విమర్శలు కురిపిస్తూ ప్రజలపై మోయరాని భారం మోపనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులమయం కావించిన కేసీఆర్ తన ఆర్ధిక నిర్వహణ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక్కటొక్కటిగా ప్రజలపై బండెడు భారం మోపడానికి సిద్దపడుతున్నారు.

మునిగిపోయే దశలో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీలు పెంచామని సమర్ధించుకోవడం తెలిసిందే. పెంచిన ఛార్జీలతోనే బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించామని సూచించారు. ఆర్టీసీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు గూడ్స్ పద్దతిని అవలంభిస్తున్నామని, త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.

ఆ తర్వాత దివాళా స్థితిలో ఉన్న డిస్కోమ్ లను కాపాడటం కోసం విద్యుత్ చార్జీలు పెంచడం తప్పనిసరి అని ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా, రాష్ట్రాభివృద్ధి కోసం, ఆర్ధిక మనుగడ సాధించాలంటే కొన్ని రంగాల్లో మార్పులు చేయడం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, ఇసుక, మైన్స్, కరెంట్ , మద్యం ధరల్ని పెంచబోతున్నట్లు తేల్చి చెప్పారు.

కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలోనే మద్యం ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించారు. గతంలో మద్యపాన నిషేదం విధిస్తే అట్టర్ ప్లాప్ అయ్యిందన్న కేసీఆర్..మద్యం తాగకుండా ఉండేలా ధరల్ని పెంచుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.