https://oktelugu.com/

గ్రేటర్ వాసులకు కేటీఆర్ న్యూఇయర్ గిప్ట్..!

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు కన్పిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలను సమీక్షించుకున్న టీఆర్ఎస్ సర్కార్ అప్రమత్తమైంది. Also Read: సీఎం జగన్ కు సినీ ప్రముఖుల ప్రశంసల వెల్లువ ! ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులు.. నిరుద్యోగులను మచ్చిక చేసుకునేలో పడింది. ఇక తెలంగాణకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్లోనూ టీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో టీఆర్ఎస్ సర్కార్ గ్రేటర్ పై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 19, 2020 / 03:05 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు కన్పిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలను సమీక్షించుకున్న టీఆర్ఎస్ సర్కార్ అప్రమత్తమైంది.

    Also Read: సీఎం జగన్ కు సినీ ప్రముఖుల ప్రశంసల వెల్లువ !

    ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులు.. నిరుద్యోగులను మచ్చిక చేసుకునేలో పడింది. ఇక తెలంగాణకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్లోనూ టీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.

    దీంతో టీఆర్ఎస్ సర్కార్ గ్రేటర్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈమేరకు గ్రేటర్ వాసులకు కొత్త సంవత్సరంలో అదిరిపోయే గిప్ట్ ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ సమయాత్తం అవుతున్నారు.

    నూతన సంవత్సరంలో హైదరాబాద్ జలమండలి ద్వారా 20వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శనివారం ఉచిత నీటిపై కావాల్సిన కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    Also Read: ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు

    సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని అధికారులకు సూచించారు.

    దీనికి సంబంధించిన విధివిధానాలు రెండ్రోజుల్లో సిద్ధం చేయాలని కేటీఆర్ జలమండలి అధికారులు ఆదేశించారు. కొత్త సంవత్సరంలో నగరవాసులకు కేటీఆర్ అదిరిపోయే గిప్ట్ ఇవ్వనుండటంపై గ్రేటర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్