
గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని పేరు చెబితేనే ఇప్పుడు టీడీపీ బ్యాచ్ దడుసుకుంటుందట.. జగన్ పై ఎవరైనా ఏదైనా అంటే బయటకొచ్చి మాట్లాడే ఈ మంత్రి గారి నోటి నుంచి మంత్రాలు కాక బూతులే ఎక్కువగా వస్తుంటాయి. టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నానిని కట్టిడి చేయడానికి టీడీపీ ప్రయత్నలు చేస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిని కట్టడి చేయాలని అధిష్టానానికి సూచించినా పట్టించుకోలేదని అంటున్నారు. అధికారులకు పెత్తనం ఇచ్చి తమను డమ్మీలను చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక నాయకులు.
చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రతిసారి ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడుపడని విషయం. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ వల్ల ఎదిగి ఇప్పుడు టీడీపీని విమర్శించడం ఏంటంటూ టీడీపీ నేతలు నాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం కూడా నాని విషయంలో సీరియస్ గానే ఉంది. ఈసారి గుడివాడలో నానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటోంది.
2014, 2019లో వైసీపీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు నాని. గుడివాడ చరిత్రలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. కొడాలి నాని గుడివాడ నుంచి పోటి చేసినన్ని రోజులూ ఆశలు వదులుకోవాలని టీడీపీ నాయకులు అనుకుంటున్నారట. ఇప్పడున్న పరిస్థితుల్లో మంత్రిగా బలంగా ఉన్న నానిని ఎదుర్కొవాలంటే కష్టమేనని టీడీపీ నాయకులు అంటున్నారట. కొడాలి నానిని ఎదుర్కొవడానికి ఐక్యమత్యంగా పోరాటం చేయాలని స్థానిక నాయకులు భావిస్తున్నారట.
కొడాలి నాని భవిష్యత్ లో ఇబ్బంది పెడుతాడని ముందే పసిగట్టినా చంద్రబాబు ఆయనను నియోజకవర్గానికి పరిమతం చేశారు. ఓ దశలో కొడాలిపై పోటికి బాలకృష్ణ ను దింపాలనుకున్నారు చద్రబాబు. గత ఎన్నికల్లో కొడాలిని ఓడించడానికి అవినాశ్ ని రంగంలో దింపారు. అవినాశ్ గెలిస్తే నానికి చెక్ పడుతుందనుకున్నారు. కానీ అది జరగలేదు. గుడవాడ నుంచి గెలిచిన నాని మంత్రి అయ్యారు.
అవినాశ్ టీడీపీని వీడాక టీడీపీ పరిస్థితి గుడివాడలో మరింత దిగజారింది. పార్టీని పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఉన్న కొద్ది మంది నేతలు గ్రూపులు కట్టారు. రావి వెంకటేశ్వరరావు, బాబ్జీ మాత్రమే దూకుడుగా ఉన్నారు. ఈ మధ్యనే టీడీపీ అధిష్టనం గుడివాడ నియోజకవర్గ ఇంచార్జిగా రావి వెంకటేశ్వరరావును నియమించింది.
రావి నియామకంపైనా నేతలు విమర్శలు చేశారు. రావి నియామకం పై పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ విమర్శలు చేశారు. గుడివాడలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6 సార్లు గెలిస్తే, టీడీపీ 8 సార్లు విజయం సాధించింది. సీపీఐ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు గెలిచింది. ముఖ్యంగా హరికృష్ణ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొడాలి నాని.. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తక్కువ సమయంలోనే గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడు గుడివాడలో నాని ఉండగా.. టీడీపీ ఆశలు వదిలేసుకునేలా బలంగా తయారయ్యారు.