
రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండక సీఎం కేసీఆర్ చాలా రోజులైంది. అయినా కూడా ఈ ఒక్క సభలో ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేశాడు. ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బుధవారం హాలియా బహిరంగ సభలో కేసీఆర్ మరోసారి రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
గ్యాప్ ఇచ్చాడని కేసీఆర్ ఇన్నాళ్లు పట్టించుకోని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ తో మరోసారి కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లో హీట్ పెంచాడు. ముఖ్యంగా కాంగ్రెస్ , బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.
కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేల్చుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ పరువు తీసేలా వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని.. తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదని కేసీఆర్ ఊగిపోయారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. డిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ యే ఈ దుస్థితికి కారనమన్నారు. రాష్ట్రాన్ని 3 ముక్కులు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలు అని విరుచుకుపడ్డారు.
పాత తవ్వకాల్లో కాంగ్రెస్ ఉమ్మడి సీఎంలు అన్న మాటలను కేసీఆర్ వల్లెవేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడని.. ఒక్క కాంగ్రెస్ నేత అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు.