
ఇన్నాళ్లుగా గుర్తుకు రాని చిత్ర పరిశ్రమ తెలంగాణ సీఎం కేసీఆర్ కు సడెన్ గా గుర్తుకు వచ్చిందని టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. సడెన్ గా రెండు సార్లు టాలీవుడ్ పెద్దలతో సీఎం కేసీఆర్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి కారణం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఎఫెక్ట్ అని అంటున్నారు.
Also Read: మోహన్ బాబు నటప్రస్థానానికి నేటితో 45ఏళ్లు పూర్తి..!
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు చిత్రపరిశ్రమను నమ్ముకొని లక్షలమంది ఉన్నారు. వారి ఓట్లు అన్నీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకంగా మారాయి. అందుకే టాలీవుడ్ పెద్దలతో కేసీఆర్ తాజాగా మరోసారి భేటి అయ్యి వరాలు కురిపించారు.
తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ అన్నారు.కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయి.. థియేటర్లు మూసివేయడం వల్ల చిత్ర పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
చిరంజీవి, నాగార్జున, టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సీఎంకు కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి కేసీఆర్ స్పందించి చర్యలు చేపడుతామన్నారు. పరిశ్రమ అభివృద్ధిపై త్వరలోనే చిరంజీవి ఇంట్లో సమావేశమై మరోసారి చర్చిస్తామని తెలిపారు.
Also Read: గ్రేటర్ లో విజయం కోసం ‘బీసీ’ వ్యూహం
ఇలా కేసీఆర్ సార్..జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న సినీ పరిశ్రమ పెద్దలు, కార్మికులు, సిబ్బందిని వారి కుటుంబాలను ఆదుకునే పనిలో పడ్డారు.మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్