https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘కపటధారి’ సుమంత్.. క్రైమ్ థిల్లర్

అక్కినేని హీరో సుమంత్ అప్పుడు ఎప్పుడో ‘సత్యం’ సినిమాతో భారీ హిట్ కొట్టి మధ్యలో ‘గోదావరి’ సినిమాతో అలరించి తర్వాత హిట్ కోసం సినిమాలు తీస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. అయినా సినిమాలు తీయడం మాత్రం ఆపడం లేదు. Also Read: స్వీటీ అనుష్క ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు ! సుమంత్ హీరోగా వస్తున్న ‘కపటధారి’ మూవీ తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ […]

Written By: , Updated On : January 13, 2021 / 12:16 PM IST
Follow us on

kapatadhaari telugu movie

అక్కినేని హీరో సుమంత్ అప్పుడు ఎప్పుడో ‘సత్యం’ సినిమాతో భారీ హిట్ కొట్టి మధ్యలో ‘గోదావరి’ సినిమాతో అలరించి తర్వాత హిట్ కోసం సినిమాలు తీస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. అయినా సినిమాలు తీయడం మాత్రం ఆపడం లేదు.

Also Read: స్వీటీ అనుష్క ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు !

సుమంత్ హీరోగా వస్తున్న ‘కపటధారి’ మూవీ తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ధనుంజయన్ నిర్మిస్తున్నారు.

కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాపలుధారి’ సినిమాకు ఇది తెలుగు రిమేక్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను సమంత-నాగచైతన్య విడుదల చేశారు. సుమంత్-నందిత జంటగా నటిస్తున్నారు.

Also Read: సింగర్ సునీతకి అండగా నిలబడిన మెగా బ్రదర్

కథను చూస్తే.. మెట్రో రైల్ తవ్వకాల్లో బయటపడిన ఒక బాలిక అస్తిపంజరాల నుంచి ఈ కథ మొదలవుతుంది. ఒక ట్రాఫిక్ పోలీసుగా ఉన్న సుమంత్ ఈ కేసును పరిశోధించి దీనివెనుక పెద్ద కుట్ర ఉందని.. చాలా మంది మిస్ అయ్యారని కనిపెడుతాడు. ఇది రాష్ట్రంలోని రాజకీయాలను షేక్ చేసే ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారుతుంది. ఈ క్రైంలు ఎవరు చేశారన్నది పెద్ద సస్పెన్స్ గా కనిపిస్తుంది.

ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ టీజర్ ను తీర్చిదిద్దారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Kapatadhaari Telugu Movie Trailer | Sumanth | Nandita Swetha | Simon K King | Pradeep Krishnamoorthy