https://oktelugu.com/

ఒకే పాత్రలో వేశ్యగా, స్పైగా ‘కాజల్ అగర్వాల్’ !

నాగార్జున సినిమాలో కాజల్ అగర్వాల్ సరికొత్త పాత్రలో కనిపించడానికి సన్నాహాలు చేసుకుంటుంది. పైగా గతంలో కాజల్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఇంతకీ ఏమిటి ఆ క్యారెక్టర్ అంటే రా ఆఫీసర్. నాగార్జున ఎక్స్ రా-ఏజెంట్ గా కనిపిస్తాడు. నాగార్జునకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ హడావుడి చేయనుంది. కాకపోతే కాజల్ ఒక స్పై అనే విషయం క్లైమాక్స్ లో తెలుస్తోంది. ఇక సినిమాలో ఎక్కువ భాగం ఆమె ఒక వేశ్యగా కనిపిస్తోందట. తన […]

Written By: , Updated On : June 15, 2021 / 05:14 PM IST
Follow us on

Kajalనాగార్జున సినిమాలో కాజల్ అగర్వాల్ సరికొత్త పాత్రలో కనిపించడానికి సన్నాహాలు చేసుకుంటుంది. పైగా గతంలో కాజల్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఇంతకీ ఏమిటి ఆ క్యారెక్టర్ అంటే రా ఆఫీసర్. నాగార్జున ఎక్స్ రా-ఏజెంట్ గా కనిపిస్తాడు. నాగార్జునకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ హడావుడి చేయనుంది. కాకపోతే కాజల్ ఒక స్పై అనే విషయం క్లైమాక్స్ లో తెలుస్తోంది.

ఇక సినిమాలో ఎక్కువ భాగం ఆమె ఒక వేశ్యగా కనిపిస్తోందట. తన అందచందాలతో తీవ్రవాదులను ఆకట్టుకుంటూ వారితో రొమాన్స్ చేస్తూ వారి రహస్యాలను డిపార్ట్మెంట్ కి చేరవేసే పాత్ర అట ఆమెది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్హున హీరోగా రాబోతున్న ఈ సినిమా మొత్తం, ఫుల్ యాక్షన్ తో సాగేలా ఉంది. అన్నట్టు ఈ సినిమా కోసం కాజల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.

అందుకే కాజల్ ఆ సీన్స్ కోసం కసరత్తులు చేస్తోంది. మరి అందాల చందమామను గూఢచారిగా చూపిస్తే వర్కౌట్ అవుతుందా ? అయినా, కాజల్ కి ఇలాంటి పాత్రలు సెట్ కావు అనేది నెటిజన్లు అభిప్రాయం. పైగా కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను కాజల్ అగర్వాల్ పోషించలేదు. ఒక విధంగా ప్రవీణ్ సత్తారు ఈ పాత్ర కోసం ఏ అనుష్కనో తీసుకుని ఉండి ఉంటే బాగుండేది అని నాగ్ కూడా అన్నాడట.

కానీ, ప్రవీణ్ సత్తారు మనసులో ఈ పాత్రకు కాజల్ కరెక్ట్ అనిపించింది. స్పై సీన్స్ రెండు ఉంటే, వేశ్య సీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆ సీన్స్ లో కాజల్ అయితేనే సినిమాకి బాగా ప్లస్ అవుతుందని దర్శకుడు ఆలోచన. మరి ఆ ఆలోచన ఎంతవరకు సెట్ అవుతుందో రేపు సినిమా రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది. మరోపక్క కాజల్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

నిజానికి కాజల్ కి ఈ క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుంది. అందుకే వెంటనే కాజల్, ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. అన్నిటికి మించి నాగ్-కాజల్ కాంబినేషన్ లో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇది. ఇక రా-ఏజెంట్ గా కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకోనుంది కాజల్. గన్ ఎలా పట్టుకోవాలో కూడా నేర్చుకోబోతుందట.