
దేశంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఇంటికే పరిమితమైన వాళ్లు చాలామంది ఉన్నారు. డిగ్రీ పాసై ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వాళ్లకు భారత టెరిటోరియల్ ఆర్మీ శుభవార్త చెప్పింది. నాన్ డిపార్టుమెంటల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జులై 20వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
http://www.jointerritorialarmy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారికి లెఫ్టినెంట్ హోదాను కల్పించడం జరుగుతుంది. ఆర్మీ అధికారులకు ఏవైతే అధికారాలు ఉంటాయో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి కూడా అవే అధికారాలు ఉంటాయని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి రూ.56,100 నుంచి 1,77,500 వరకు వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి శాలరీ, ఆలవెన్స్ లు ఉంటాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తును కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మాత్రమే పరీక్ష కేంద్రంగా ఉండగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2021 సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తేదీన పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ఇతర వివరాలతో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.