టికెట్ తీసుకోకుండా దొరికిపోయిన జీవిత.. అలనాటి సంగతులు గుర్తు చేసుకున్న నటి

సినిమా పరిశ్రమలో జీవితది ప్రత్యేక శైలి. తనదైన గుర్తింపుతో నటిగా, దర్శకురాలిగా తనేంటో నిరూపించుకున్నారు. హీరోయిన్ గా వచ్చి దర్శకురాలిగా మారిన జీవిత ఎన్నో విజయాలు అందుకున్నారు. రాజశేఖర్ ను వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. మొదట్టో ఇద్దరు కలిసి నటించిన జీవిత, రాజశేఖర్ పెళ్లి తరువాత నటనకు దూరమయ్యారు. పిల్లలు పుట్టిన తరువాత మొత్తానికే నటనకు స్వస్తి పలకి దర్శకురాలిగా అవతారమెత్తారు. వీరికి శివానీ, శివాత్మిక అనే కూతుర్లు ఉన్నారు. శివాత్మిక దొరసాని సినిమాతో సినీరంగ […]

Written By: Srinivas, Updated On : July 19, 2021 11:05 am
Follow us on

సినిమా పరిశ్రమలో జీవితది ప్రత్యేక శైలి. తనదైన గుర్తింపుతో నటిగా, దర్శకురాలిగా తనేంటో నిరూపించుకున్నారు. హీరోయిన్ గా వచ్చి దర్శకురాలిగా మారిన జీవిత ఎన్నో విజయాలు అందుకున్నారు. రాజశేఖర్ ను వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. మొదట్టో ఇద్దరు కలిసి నటించిన జీవిత, రాజశేఖర్ పెళ్లి తరువాత నటనకు దూరమయ్యారు. పిల్లలు పుట్టిన తరువాత మొత్తానికే నటనకు స్వస్తి పలకి దర్శకురాలిగా అవతారమెత్తారు. వీరికి శివానీ, శివాత్మిక అనే కూతుర్లు ఉన్నారు. శివాత్మిక దొరసాని సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. శివానీ కూడా అవకాశం ఎదురుచూస్తోంది.

అయితే జీవిత తన కాలేజీ రోజుల్లో జరిగిన చేదు సంఘటనను తలుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. కాలేజీ రోజుల్లో రోజు బస్సుల్లో వెళ్లొచ్చేది. అప్పుడు జీవితకు పాస్ ఉండేది. ఓ సారి పాస్ అయిపోయినా కూడా రెన్యువల్ చేయించుకోవడం మరిచిపోయారు. ఆ విషయం తెలిసి కూడా కండక్టర్ అడిగితే పాస్ అని చెప్పి తప్పించుకుంది. ఆ తర్వాత ఆయనొచ్చి పాస్ చూపించమని అడిగితే డేట్ అయిపోయిన పాస్ చూపించింది. దీంతో కండక్టర్ అదే విషయం చెప్పడంతో బస్సులో ఉన్న వాళ్లంతా నవ్వుకున్నారు.

కండక్టర్ టికెట్ తీసుకోమని తొందరపెడితే తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో ఏమి చేయాలో తోచకుండా పోయింది. అప్పుడు బస్సులోంచి దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటున్న తరుణంలో తన తండ్రి స్నేహితుడు ఒకరు బస్సులో జరిగినదంతా చూసి టికెట్ తీసుకుని తనను రక్షించాడని చెప్పింది. ఆ అనుభవం తరువాత ఎక్కడికి వెళ్లినా కూడా చేతిలో డబ్బులు తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారట.

జీవితంలో ఒక్కోటి చిన్న సంఘటనలైనా జీవితాంతం గుర్తుండిపోతాయి. తన దగ్గర రూపాయి లేకుండా ప్రయాణం చేసిన జీవిత తన తండ్రి స్నేహితుడు చేసిన సాయంతో గట్టెక్కారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి సంగతులను నెమరువేసుకున్నారు. చిన్న పొరపాటే పెద్ద గండాన్ని తెచ్చి పెడుతుందనేది సత్యం. అందుకే మనం జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం గురించి వివరించారు.