
టీమిండియా స్పీడ్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రికెటర్ వివాహం ఖాయమైంది. ఈనెల 14న గోవాలో బుమ్రా వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది.
బుమ్రాకు కాబోయే భార్య ఎవరనే దానిపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో వివాహం జరుగబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్ ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇంగ్లండ్ తో 4వ టెస్టుకు ముందు బుమ్రా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. పెళ్లి కుదిరిందనే వార్తలు అప్పుడే వచ్చాయి. తాజాగా అది ఖాయమైంది. దీంతో ఇంగ్లండ్ తో వన్డేలు, టీట్వంటీలకు కూడా బుమ్రా దూరం కానున్నాడు.