ఏపీ సర్కార్ పాఠశాలల నిర్వహణపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియెట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 103 రోజుల పాటు కార్యాచరణను రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు.. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు తరగతులు జరుగుతాయి.
జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికలు అమలు చేయాలని డీఈవో ఆదేశించారు
ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. 106 పనిదినాలు ఉంటాయి. మే 31 వరకు తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను రద్దు చేశారు.
2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 3వ తేది నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో పాఠశాలలు, కళాశాలలు బంద్ అయిపోయాయి. ఏడాదిగా పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఆన్ లైన్ క్లాసులతో చస్తున్నారు. విద్యా సంవత్సరాన్ని రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్ కు ఇబ్బందికరమని భావించిన ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు విరమించుకున్నాయి.