మ్యాజిక్ ఫిగర్ దిశగా జో బైడెన్.. వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఖాయామా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగా వెనుకబడగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నాడు. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో హోరాహోరీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్లు.. మరికొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాట్స్ ముందంజలో […]

Written By: NARESH, Updated On : November 5, 2020 10:53 am
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగా వెనుకబడగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నాడు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో హోరాహోరీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్లు.. మరికొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాట్స్ ముందంజలో నిలిచారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండగా ఇప్పటికే జో బైడెన్ ఎలక్ట్రోరల్ ఓట్లలో ముందంజలో ఉన్నాడు.

Also Read: అమెరికా కౌంటింగ్ క్లైమాక్స్: కీలకంగా ఆ రాష్ట్రం.. విజేతలు ఎవరు?

తాజాగా కీలకమైన మిషిగన్(16)లోనూ బైడెన్ విజయం సాధించాడు. దీంతో బైడెన్ 264 ఓట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ దిశగా వెళుతున్నాడు. ట్రంప్ కేవలం 214 ఓట్లు సాధించాడు. కాగా ట్రంప్ మిషిగన్ ఎన్నికల ఫలితాల్లో అవకతవలు జరిగాయని అక్కడి కోర్టులో దావా వేశాడు.

Also Read: ఫలితాలు రాకముందే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కు ఇప్పటికే 7కోట్ల 19లక్షల ఓట్లు లభించగా ట్రంప్ కు 6కోట్ల 85లక్షల ఓట్లు పోలయ్యాయి. గతంలో బరాక్ ఒబమా సాధించిన ఓట్ల కంటే జో బైడెన్ కు ఎక్కుువ ఓట్లు పోలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత వందేళ్లలో ఈసారే అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.