https://oktelugu.com/

గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికి అలర్ట్.. బుకింగ్ కు దేశమంతటా ఇదే నెంబర్‌!

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఒసి) నవంబర్ నెల 1వ తేదీ నుంచి బుకింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. 7718955555 నెంబర్‌ ద్వారా మాత్రమే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకోగలరని వెల్లడించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న నంబర్లు అన్నీ నవంబర్ 1వ తేదీ నుంచి పని చేయవని.. 24 గంటలు పని చేసే ఈ నంబర్ కు ఫోన్ చేసి వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఐఒసి తెలిపింది. వినియోగదారులు గ్యాస్ ను బుకింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2020 / 09:40 AM IST
    Follow us on

    ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఒసి) నవంబర్ నెల 1వ తేదీ నుంచి బుకింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. 7718955555 నెంబర్‌ ద్వారా మాత్రమే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకోగలరని వెల్లడించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న నంబర్లు అన్నీ నవంబర్ 1వ తేదీ నుంచి పని చేయవని.. 24 గంటలు పని చేసే ఈ నంబర్ కు ఫోన్ చేసి వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఐఒసి తెలిపింది.

    వినియోగదారులు గ్యాస్ ను బుకింగ్ చేసుకోవాలంటే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ వినియోగదారులు తమ కన్య్జూమర్‌ నెంబర్‌ ను నమోదు చేసుకొని ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఆ సంస్థ సేల్స్‌ డిప్యూటీ మేనేజర్‌ ఫుల్‌జెలె మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకునేందుకు ఒకే కామన్ నంబర్ ఏర్పాటైంది.

    పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ఎస్ విధానంలో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ విధానం ద్వారా ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను దేశంలో ఎక్కడినుంచైనా సులభంగా పొందవచ్చని ఐఒసి భావిస్తోంది. బుకింగ్ సమయంలో 16 అంకెల గ్యాస్‌ కనెక్షన్‌ ఐడి నంబర్ ను గ్యాస్ వినియోగదారులు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.

    ఇండేన్ రికార్డులలో ఫోన్ నంబర్ రికార్డ్ కాని కస్టమర్లు ఐవిఆర్ఎస్ కాల్ ద్వారా 16 అంకెల ఐడీ నంబర్ ను రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఒసి తీసుకున్న నిర్ణయం ద్వారా ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. https://cx.indianoil.in వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేసి ఇండేన్ గ్యాస్ వినియోగదారులు మరింత సమాచారం పొందవచ్చు.