
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు రసపట్టులో పడింది. చెన్నైలో నాలుగో రోజు అద్భుతమే జరిగింది. చెన్నైకే చెందిన బౌలర్ అశ్విన్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లు గొప్ప పోరాటంతో టీమిండియా మ్యాచ్ పై ఆశలు నిలుపుకుంది. 4వ రోజులు అశ్విన్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను 178 పరుగులకే ఆల్ ఔట్ చేశాడు. అంతుకు ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. సుందర్ 85 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. అతడికి ఎవరైనా తోడుగా ఉంటే టీమిండియా మరింత బిగ్ స్కోర్ చేసి ఉండేది.
నిజానికి భారత్ ను ఫాలో ఆన్ ఇచ్చే అవకాశమున్నా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. 241 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ కు భారత బౌలర్ అశ్విన్ చుక్కలు చూపించాడు. తొలి బంతికే బర్న్స్ ను ఔట్ చేశాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు వేగంగా పరుగులు తీయడానికి ప్రయత్నించగా.. అంతే వేగంగా అశ్విన్ , నదీమ్ బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ను 178 పరుగులకే కుప్ప కూల్చారు.
అనంతరం 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కానీ రోహిత్ శర్మ ఒక సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించినా తర్వాత లీచ్ అతడికి ఔట్ చేయడంతో భారత్ కు షాక్ తగిలింది. అనంతరం పూజారా, గిల్ మరో వికెట్ పడకుండా కాపు కాసారు. నాలుగో రోజు ఆటను ముగించారు. ఇంకా టీమిండియా 380 పైచిలుకు లక్ష్యాన్ని రేపు అందుకుంటుందా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
రేపు టీమిండియా ఆటగాళ్లు నిలబడితే.. గెలుస్తుంది. లేదంటే ఓడిపోతుంది. ఇంగ్లండ్ బౌలర్లను కాచుకొని డ్రా చేసుకున్నా ఓటమి తప్పుతుంది. సో చివరి రోజు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.