
టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజే మొత్తం మ్యాచ్ ముగిసింది. స్పిన్నర్ల హవా నడిచిన ఈ టెస్టులో చివరి రోజు ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 49 పరుగుల లక్ష్యాన్నికేవలం 7.4 ఓవర్లలోనే ఛేధించింది. రోహిత్ 25, గిల్ 15 పరుగులతో భారత్ ను గెలిపించారు. దీంతో సిరీస్ లో ఇండియా 2-1తో ఆధిక్యం సంపాదించింది. 4వ టెస్టు ఇక్కడే జరుగనుంది.
సాధారణంగా టెస్ట్ అంటే ఎన్నిరోజులు ఆడుతారు. కనీసం 5 రోజులు. ఆ ఐదు రోజుల్లో కూడా ఆల్ ఔట్ కానీ బ్యాట్స్ మెన్ ఉంటారు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఉంటారు. ఐదు రోజుల్లో కూడా ముగిసిపోకుండా డ్రా అయ్యే టెస్టులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆట రెండోరోజే ఖతమయ్యేలా ఉంది. ఇంత దారుణమైన మ్యాచ్ ను ఎప్పుడూ చూడలేదని ఇటు భారత, ఇంగ్లండ్ అభిమానులు కూడా ఈసండించుకుంటున్నారు.
అహ్మదాబాద్ లోని మొతేరాలో ఐదురోజుల ఆట చూద్దామని వచ్చిన అభిమానులు ఇప్పుడు రెండు రోజుల్లోనే ముగిసే మ్యాచ్ ను చూసి ఆనందపడాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు.
మొతేరాలో మొత్తం స్పిన్ పిచ్ ను ఏర్పాటు చేసిన బీసీసీఐ అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టంగా మార్చింది. గింగిరాలు తిరుగుతున్న పిచ్ పై బ్యాటింగ్ చేయడం కానాకష్టమైంది. అటు ఇంగ్లండ్, ఇటు భారత బ్యాట్స్ మెన్ పిచ్ పై బ్యాటింగ్ చేయలేక క్యూ కడుతున్నారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 81 పరుగులకే కుప్ప కూలింది.
ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 49 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుతం 11 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడుతోంది. ఈరోజు రాత్రిలోపు మ్యాచ్ ఇండియానా? ఇంగ్లండ్ నా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు పండుగ చేసుకున్నారు. అక్షర్ ఐదు వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచారు. 81 పరుగులకే ఇంగ్లండ్ ఆల్ ఔట్ కాగా.. టీమిండియా ప్రస్తుతం 49 పరుగుల విజయలక్ష్యంతో ఆడుతోంది. ఇంకో 38 పరుగులు చేస్తే ఇండియా విజయం సాధిస్తుంది. ఈరోజు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.