
ఇంగ్లండ్ తో సొంతగడ్డపై తొలి టెస్ట్ లో ఓడిపోయిన టీమిండియాకు రెండో టెస్ట్ లో అన్నీ కలిసి వచ్చాయి. టాస్ గెలవడం.. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించడం.. ఇంగ్లండ్ ను స్పిన్ తో కట్టడి చేయడం.. ఇలా తొలి ఇన్నింగ్స్ లు ముగిసే సరికి ఇండియా పటిష్ట స్థితిలో చేరింది.
Also Read: చెన్నై టెస్ట్ రసవత్తరం: ఇంగ్లండ్ 134 ఆలౌట్.. భారత్ 195 లీడ్
తొలి టెస్టులో ఎలాగైతే టీమిండియాను ఇంగ్లండ్ ఓడించిందో అలాంటిదే సేమ్ సీన్ ఇంగ్లండ్ కు రెండో టెస్టులో రిపీట్ అవుతోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఆటపై పూర్తిగా పట్టు బిగింది. మొత్తం ఇంగ్లండ్ పై 249 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మరో తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈరోజు ఫుల్ డే ఆడినా లేక 400 స్కోరు సాధించినా ఇంగ్లండ్ కు చుక్కులు కనిపించడం ఖాయం. ఇంగ్లండ్ కు లక్ష్యం సాధించడం కష్టంగా మారింది.
ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజే తేలిపోయింది. కేవలం 134 పరుగులకే ఆలౌటైంది. సొంత గడ్డపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గడగడలాడించారు. ఐదు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను కుప్ప కూల్చారు. తొలి రోజు చేపాక్ పిక్ బ్యాటింగ్ కు అనుకూలించింది. రోహిత్ శర్మ సెంచరీతో భారత్ నిలబడింది. కానీ రెండో రోజు నుంచి స్పిన్ తిరగడంతో ఇండియా కూడా 29 పరుగులకే మొత్తం వికెట్లు కోల్పోయింది.
భారత్ ను 300 పైచిలుకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ ఆనందం కాసేపటికే ఆవిరైంది. వారు కేవలం 134 పరుగులకే కుప్పకూలారు. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ సైతం ఔటయ్యాడు.
Also Read: ఆట మొదలైంది: ఇండియా 329 ఆలౌట్.. పంత్ హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ 23/3
అయితే రోహిత్ శర్మ, పూజారా మరో వికెట్ పడకుండా కాపు కాశారు. అయితే గింగిరాలు తిరుగుతున్న ఈ పిచ్ పై ఓపికతో ఆడితేనే పరుగులు వస్తాయి. లేదంటే ఔట్ కావడం ఖాయం. మరి ఈరోజు కనుక టీమిండియా మరో 150 పరుగులు చేసినా స్కోరు 400 అవుతుంది. అప్పుడు ఇంగ్లండ్ ను రెండు రోజుల్లో ఔట్ చేయడం ఈజీ . స్పిన్ విపరీతంగా తిరుగుతున్న చేపాక్ పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత్ కు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏమేరకు నిలబడుతారన్నది వేచిచూడాలి.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గెలుపును ఎవరూ ఆపలేరు.