
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఇప్పటికీ టాలీవుడ్ కు సాకారం అవుతోంది. కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డ థియేటర్లు తెరుకున్నాయి. కానీ కరోనా భయానికి జనాలు ఎవరూ థియేటర్లకు రాలేదు. ఇప్పుడు కరోనా తగ్గడంతో అంతా నార్మల్ అయిపోయింది.
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైతే జనాలు వచ్చారు చూశారు. కలెక్షన్లు బాగున్నాయి. అయితే కేంద్రం విధించిన కరోనా నిబంధనలతో 50శాతం మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉండడంతో సినిమా నిర్మాతలు, యజమానులకు నష్టం వాటిల్లుతోంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి.
ఈ క్రమంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. సంక్రాంతి సినిమాల జోష్ ను కంటిన్యూ చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఫిబ్రవరి 1 నుంచి థియేటర్ల ఆక్యూపెన్సీ లిమిట్ ను పెంచుతున్నట్టు ప్రకటించింది. మొత్తం 100శాతం కాకుండా 75శాతం వరకు కూడా సీటింగ్ కెపాసిటీని పెంచేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది.
దీన్ని బట్టి మార్చి 1 లేదా ఏప్రిల్ 1 వరకు పూర్తి స్థాయిలో థియేటర్లు అందుబాటులోకి రావడం పక్కాగా తెలుస్తోంది. వేసవి తర్వాత ఖచ్చితంగా సినిమా పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
దీంతో టాలీవుడ్ లో సైతం ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారీ సినిమాలు విడుదలకు ప్లాన్ చేస్తున్నాయి. ‘ఆచార్య’, వకీల్ సాబ్ లు ఈ వేసవికే రెడీ అవుతున్నాయి. ఈ గొప్ప శుభవార్త టాలీవుడ్ యే కాదు దేశ సినీ రంగానికి ఊపిరిపోస్తోంది.