న్యాయస్థానాల్లో తీర్పులు సీఎం జగన్ కు అచ్చిరావని మరోసారి తేటతెల్లమైంది. వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించిన ప్రతీసారి వారికే అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు కోర్టులను మెప్పించకలేక పోతుండటంతో న్యాయస్థానాల్లో జగన్ సర్కారుకు ప్రతీసారి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
Also Read: భారత్ బంద్ కు అనుహ్య స్పందన.. రైతు కోసం ఏకతాటిపైకొచ్చిన దేశం..!
ఏపీలో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం నడుస్తున్న విషయం అందరికీ తెల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ తాను పదవీలో నుంచి దిగేలోపు జగన్ సర్కారుకు జలక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు.
అయితే ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం త్వరలోనే ముగియనుండటంతోనే ఆయన పదవీ నుంచి తప్పుకున్నాక ఎన్నికలకు వెళ్లాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీంతో ఎన్నికలను కమిషనర్ కు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లభించడం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహరంపై నిమ్మగడ్డ రమేష్ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు.
ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకారం అందించడం లేదని ఇది రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో మరిన్ని కేసులు పెరుగుతాయని హైకోర్టుకు విన్నవించి ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది.
Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష పేపర్ల సంఖ్య కుదింపు..?
ప్రభుత్వం తరపు వాదన విన్న హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు స్టేకు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. దీంతో స్థానిక సంస్థల నిర్వహణపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. .
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ రెడీ అవుతుండగా జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ మరింత హాట్ టాపిక్ గా మారేలా కన్పిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్