హైఅలెర్ట్: తెలంగాణలో భూములకు ఇక రెక్కలు

తెలంగాణలో భూములకు ఇక రెక్కలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. కోవిడ్ నేపథ్యంలో ఆదాయం కోల్పోవడంతో ఇప్పుడు పిన్నీస్ నుంచి పెట్రోల్ దాకా అన్నింటికి పెంచే యోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా భూములపై పడింది. రాష్ట్రంలో నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఇవాళ మరో దఫా సమావేశమైంది. ఈ మేరకు భూముల విలువ పెంచేందుకు రెడీ అయ్యింది. హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి […]

Written By: NARESH, Updated On : June 30, 2021 10:33 am
Follow us on


తెలంగాణలో భూములకు ఇక రెక్కలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. కోవిడ్ నేపథ్యంలో ఆదాయం కోల్పోవడంతో ఇప్పుడు పిన్నీస్ నుంచి పెట్రోల్ దాకా అన్నింటికి పెంచే యోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా భూములపై పడింది. రాష్ట్రంలో నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఇవాళ మరో దఫా సమావేశమైంది. ఈ మేరకు భూముల విలువ పెంచేందుకు రెడీ అయ్యింది.

హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటిలో ఈ అంశంపై కసరత్తు జరిగింది.ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.

రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయమై సుధీర్ఘంగా సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేష్ విలువ పెంచే విషయమై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని.. అధికారులు ఈ సందర్భంగా వివరించారు. పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విలువ పెంచలేదని తెలిపారు.

చట్టప్రకారం ఎప్పటికప్పుడు భూముల మార్కెట్ విలువను సమీక్షించుకుంటూ రిజిస్ట్రేషన్ విలువను పెంచడానికి రెడీ అయ్యింది.

ఇప్పటికే ఏపీలో 7.5శాతం ఉండగా.. తమిళనాడులో 7.5శాతం, మహారాష్ట్రలో 7శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం పెంచలేదని.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూముల విలువ వెంటనే సవరణ చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఏపీలో ఎనిమిదేళ్లలో ఏడు సార్లు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విలువ కన్నా ఎక్కువకే లక్షలాది రిజిస్ట్రేషన్లు ఉన్నాయని తెలిపారు.

హెచ్ఎండీఏ పరిధిలో అధిక విలువతోనే 51శాతం రిజిస్ట్రేషన్లు ఉన్నాయని అధికారులు వివరించారు. తక్కువ రిజిస్ట్రేషన్ విలువతో రుణాలకు ఇబ్బందులు ఉన్నాయని.. ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధితో గ్రామాల్లోనూ భూమి విలువ అధికం ఉందని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూమి విలువ భారీగా పెరిగిందని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తెచ్చారు.