
బాపు బొమ్మ.. కుందనాల బొమ్మగా తెలుగులో పేరొందిన కన్నడ బ్యూటీ ప్రణీత కరోనా లాక్ డౌన్ వేళ అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకుంది. ‘అత్తారింటికి దారేది’ మూవీలో తన అందచందాలతో ‘బాపు బొమ్మగా’ తెలుగువారికి చేరువైన ఈ కన్నడ అందం తాజాగా సినిమా అవకాశాలు తగ్గిపోవడం.. కరోనా లాక్ డౌన్ తర్వాత వస్తాయా? రావా? అన్న ఆందోళన.. భవిష్యత్ లో సినిమాలేవీ లేకపోవడంతో ఇక సినిమా ఇండస్ట్రీకి బైబై చెప్పి ప్రణీత ఓ ఇంటి దానిదైంది.
బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె ఏడడుగులు వేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
తాజాగా ప్రణీత-నితిన్ ల వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తెలుగులో హిట్ అయిన పోకిరి కన్నడ వెర్షన్ రిమేక్ లో ‘ప్రణీత’ కథానాయికగా కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా వచ్చింది. సెకండ్ లీడ్ హీరోయిన్ గా తెలుగులో కనిపించింది.
అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే, లాంటి తెలుగు చిత్రాల్లో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘హంగామా2’ చిత్రంలో ప్రణీత నటిస్తోంది. మంచి కెరీర్ ఉండగా.. సడెన్ గా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.