
ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శాస్త్రవేత్తలు వైరస్ కు చెక్ పెట్టేందుకు చేస్తున్న పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కేవలం 30 సెకన్లలో కరోనా వైరస్ ను అంతం చేసే స్ప్రేను తయారు చేశారు. ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతున్న తరుణంలో ప్లాజ్మా జెట్ స్ప్రే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి.
శాస్త్రవేత్తలు 3డీ ప్రింటర్ నుంచి ప్రెజర్ ప్లాజ్మా జెట్ స్ప్రేను తయారు చేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో ప్లాస్మాజెట్ స్ప్రే అద్భుతంగా పని చేస్తుందని.. కేవలం ఏడు సెకన్ల లోపు ప్లాస్టిక్ ఉపరితలాలు, లోహాలపై ఉన్న వైరస్ ను చంపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాను కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు పడుతున్న శ్రమకు ప్లాస్మా జెట్ స్ప్రే రూపంలో ఫలితం దక్కిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
మాస్క్ ను వినియోగించే వాళ్లు ఈ స్ప్రే ను మాస్క్ పై వినియోగించిన సమయంలో మాస్క్ పై ఉన్న వైరస్ కూడా అంతమైనట్లు గుర్తించారు. ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ జర్నల్ లో ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించారు.
ప్లాస్మాజెట్ స్ప్రేకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. త్వరలోనే ప్రజలకు ఈ స్ప్రే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ స్ప్రే సహాయంతో బహిరంగ ప్రదేశాల్లో కరోనా వైరస్ ను అంతం చేయవచ్చని తెలుస్తోంది.