https://oktelugu.com/

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

కరోనా ప్రభావంతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేకపోవడంతో రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతమే జీతమే తీసుకుంటున్నారు. జీతాలు, గత రెండు నెలల బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు అజయ్ కల్లమ్ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్లామ్ జూన్ నెల నుంచి అందరికీ […]

Written By: , Updated On : May 21, 2020 / 04:12 PM IST
Follow us on

కరోనా ప్రభావంతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేకపోవడంతో రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతమే జీతమే తీసుకుంటున్నారు. జీతాలు, గత రెండు నెలల బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు అజయ్ కల్లమ్ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్లామ్ జూన్ నెల నుంచి అందరికీ పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తీసుకోనుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 50 శాతం కోత విధించడంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయ శాఖ ఉద్యోగి లక్ష్మీ నర్సింహమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉద్యోగులకు రెండు నెలల పూర్తి జీతం చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్ లకు మే నెల నుంచే నూరు శాతం పెన్షన్ ఇస్తున్నారు.