దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం 50,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఉచితంగా బంగారం ఇస్తే మాత్రం ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వేల రూపాయలు విలువ చేసే బంగారం వెనెజులా నగరంలో సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వస్తోంది.
Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..?
సముద్ర తీరానికి బంగారం రావడంతో అక్కడ నివశించే వారి పంట పండింది. బంగారం దొరికినది దొరికినట్టు వాళ్లు తీసుకెళ్లిపోయారు. బంగారం ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు సైతం సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం. అధికారికంగా ఎవరికి ఎంత బంగారం, వెండి దొరికిందో తెలియదు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వస్తువు మాత్రం దొరికిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
Also Read: ‘బిజినెస్’గా మారిన బొడ్డుతాడు.. ఒకప్పుడు తాయత్తు.. ఇప్పుడు బిజినెస్!
ఆభరణాలు దొరికిన వాళ్లలో చాలామంది ఇప్పటికే ఆ ఆభరణాలను అమ్మేయడం గమనార్హం. దొరికన ఆభరణాలు 100 డాలర్ల నుంచి 1500 డాలర్ల వరకు అమ్ముడయ్యాయని ఆభరణాల విలువలో సగం ధరకు వ్యాపారులు బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేశారని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సముద్రం ఒడ్డుకు బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకురావడం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులు మాట్లాడుతూ తమ జీవితంలో ఒడ్డుకు బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకురావడం ఎప్పుడూ చూడలేదని ఇలా జరగడం ఇదే తొలిసారని తెలిపారు. అక్కడికి బంగారం, వెండి అభరణాలు కొట్టుకురావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బంగారు ఆభరణాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.