https://oktelugu.com/

జీహెచ్ఎంసీ కౌంటింగ్: ఎస్ఈసీ vs హైకోర్టు.. ఏం జరుగనుంది?

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పీటముడి నెలకొంది. తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు కౌంటింగ్ లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నది అంతుచిక్కడం లేదు. తాజాగా హైకోర్టు ఎన్నికల కమిషన్ కు స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఓట్ల లెక్కింపులో గుర్తు లేకున్నా ఓటుగానే పరిగణించి సిబ్బంది పూర్తి చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఇది ఆలస్యమయ్యేలా కన్పిస్తుంది. రిజల్ట్స్ ను హోల్డ్ లో పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2020 / 12:04 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పీటముడి నెలకొంది. తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు కౌంటింగ్ లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నది అంతుచిక్కడం లేదు. తాజాగా హైకోర్టు ఎన్నికల కమిషన్ కు స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఓట్ల లెక్కింపులో గుర్తు లేకున్నా ఓటుగానే పరిగణించి సిబ్బంది పూర్తి చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఇది ఆలస్యమయ్యేలా కన్పిస్తుంది. రిజల్ట్స్ ను హోల్డ్ లో పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీలో కేసీఆర్ కు ఉద్యోగుల దెబ్బ

    ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో బీజేపీ దూసుకెళుతోంది. తాజా సమాచారం మేరకు 150 డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 80కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్నారు… టీఆర్ఎస్ అభ్యర్థులు 35 స్థానాల్లో.. ఎంఐఎం అభ్యర్థులు 11 స్థానాల్లో.. కాంగ్రెస్ మూడు స్థానంలో అధిక్యంలో ఉన్నాయి. తాజాగా పోస్టల్ ఓట్లు పూర్తవడంతో ఇక బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

    ఇప్పటికే కొన్ని డివిజన్లలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రౌండ్ల వారీగా ఫలితాలను అధికారులు వెల్లడించారు. రౌండ్ కు 14వేల ఓట్లను లెక్కించనున్నారు. దీంతో తొలి ఫలితం మెహదీపట్నం నుంచే వెలువడనుంది. ఈ డివిజన్లలో కేవలం 11వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి ఫలితం ఇక్కడి నుంచే రానుంది. చివరగా మైలార్ దేవ్ పల్లి ఫలితం వచ్చే అవకాశం ఉంది.

    తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వస్తిక్ గుర్తు ఓట్లపై లేకున్నా.. పెన్నుతో టిక్ చేసినా కూడా ఓటుగానే పరిగణించాలని నిన్న రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బీజేపీ హైకోర్టుకు ఎక్కగా.. తాజాగా స్వస్తిక్ గుర్తు ఉంటే ఓటు అని తీర్పునిచ్చింది. ఇప్పటికే ఎస్ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీజేపీకే పోస్టల్ బ్యాలెట్ లో మెజార్టీ వచ్చింది. స్వస్తిక్ గుర్తు లేని వాటిని కూడా లెక్కించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో మళ్లీ లెక్కిస్తారా? అదే కొనసాగిస్తారా అన్నది గందరగోళంగా మారింది. హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు లేట్ కావడం ఖాయం కావడంతో దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

    Also Read: ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక ఎన్నికలు

    రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై మళ్లీ హైక్టోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. హైకోర్టు పెన్నుతో ఉన్న ఓట్లను లెక్కించొద్దని.. కేవలం స్వస్తిక్ గుర్తున్న ఓట్లనే లెక్కించాలని తాజాగా ఆదేశాలివ్వడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరికాదంది.రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర హోదాలో పని చేస్తుందని.. దీని అధికారాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం  చేసుకోవడం సరికాదనే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ  విషయాన్నే కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పును హైకోర్టు పునః పరిశీలించాలని ఎస్ఈసీ కోరింది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!

    ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తి అయ్యింది. హైకోర్టు అభ్యంతరంతో దీన్ని మళ్లీ లెక్కిస్తారా? వదిలేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్