https://oktelugu.com/

‘గాలి సంపత్’ ట్రైలర్ టాక్: ఫఫ్సా లాంగ్వేజ్ తో తండ్రీకొడుకుల సెంటిమెంట్

యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.తను కథ సమకూర్చి కొత్త దర్శకుడు అనీష్ కృష్ణతో ‘గాలి సంపత్’ అనే మూవీని తెరకెక్కించాడు. ఇందులో హీరోగా శ్రీవిష్ణు, సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. సాహూ, హరీష్-క్రిష్ణ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైలర్ ను విడుదల చేశారు. చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2021 / 12:24 PM IST
    Follow us on

    యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.తను కథ సమకూర్చి కొత్త దర్శకుడు అనీష్ కృష్ణతో ‘గాలి సంపత్’ అనే మూవీని తెరకెక్కించాడు. ఇందులో హీరోగా శ్రీవిష్ణు, సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. సాహూ, హరీష్-క్రిష్ణ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ చిత్రం టైలర్ ను విడుదల చేశారు. చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ చూస్తే ఫక్తు ఇది కామెడీ ఎంటర్ టైన్ మెంట్ అని కానీ లోతుగా తండ్రీకొడుకుల సెంటిమెంట్ ఉంటుందని తెలుస్తోంది.

    తండ్రుల బాధ్యతలు.. వారి బరువులు కొడుకులకు తెలిసే సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్టు డైలాగులను బట్టి తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ ఉన్నన్నీ నాళ్లు తిట్టే శ్రీవిష్ణు.. అతడి కనపడకపోయేసరికి పడే బాధను తెరపై చూపించారు.

    ఇక గాలి ద్వారా ‘ఫఫ’ అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడే భాష ఈ ట్రైలర్ లో హైలెట్ అనే చెప్పాలి. బాహుబలిలో కిలికిలి భాషలో ఇది ఫేమస్ అవుతుందని అనిపిస్తోంది.

    తండ్రీకొడుకుల మధ్య గొడవ జరగడం.. తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. ఓ బావిలో పడటం.. తండ్రిని వెతికే సమయంలో కొడుకు పడే వేదనను చూపించారు.

    ఎస్.క్రిష్ణ స్టోరీ అందించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించారు. లవిలీ సింగ్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ ఆకట్టుకుంటోంది.