కరోనాకు తోడుగా.. చలి పంజా..!

కరోనాతో ప్రపంచమంతా ఓవైపు పోరాడుతోంది. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా తగ్గుతుందని అనుకున్న సమయంలోనే సెకండ్ వేవ్ మొదలై రెట్టింపు సంఖ్యలో కేసులు బయటపడుతుండం ఆందోళన రేపుతోంది గత వారంరోజులుగా బ్రిటన్.. యూరప్ దేశాల్లో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక భారత్ లో కరోనా మహమ్మరి కట్టడిలోనే ఉన్నా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు భయాందోళలకు గురిచేస్తున్నాయి. […]

Written By: Neelambaram, Updated On : December 21, 2020 11:09 am
Follow us on

కరోనాతో ప్రపంచమంతా ఓవైపు పోరాడుతోంది. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా తగ్గుతుందని అనుకున్న సమయంలోనే సెకండ్ వేవ్ మొదలై రెట్టింపు సంఖ్యలో కేసులు బయటపడుతుండం ఆందోళన రేపుతోంది

గత వారంరోజులుగా బ్రిటన్.. యూరప్ దేశాల్లో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక భారత్ లో కరోనా మహమ్మరి కట్టడిలోనే ఉన్నా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు భయాందోళలకు గురిచేస్తున్నాయి.

గత 24గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే చలి పంజా విసురుతున్నట్లే కన్పిస్తోంది. కొమురంభీమ్ జిల్లా గిన్నెదరిలో 4.3 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 4.6.. తాంసిలో 4.9.. బేలా 5.0.. సొనాలలో 5.3.. నేరడిగొండలో 5.4.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వికరాబాద్ జిల్లా మొమిన్‌పేటలో 5.0.. మార్‌పల్లెలో 5.7.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 5.1.. అల్గోల్ 5.6.. సిర్పూర్ (యు), బరంపూర్‌, డోంగ్లీ, అదిలాబాద్ అర్బన్‌లలో 6.0లో తక్కవ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక ఏపీలోని విశాఖ ఏజేన్సీలోనూ చలిపంజా విసురుతోంది. చింతపల్లి.. లంబసింగిలో 6.5.. మినుములూరులో 8.. అరకు.. పాడేరులో 9డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సాయంత్రం 4గంటల నుంచి చల్లనిగాలులు వీస్తున్నాయి.

దీంతో చిన్నారులు.. వృద్ధులు.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగానే పలుచోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో కరోనా కేసులు పెరుగుతాయా? అనే భయాందోళన మరోవైపు నెలకొంది.