https://oktelugu.com/

ఎన్నికల అక్రమాలు.. పోటెత్తిన ప్రజానీకం

పంచాయతీ సెగ అంటుకుంది. నాలుగో విడతలో అక్రమాలు జరిగాయంటూ జనం రోడ్డెక్కారు. ఏకంగా కలెక్టరేట్ ను ముట్టడించారు. పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఏకంగా విశాఖ కలెక్టరేట్ ను జనం ముట్టడించారు. Also Read: మానవత్వం మరుస్తున్నారా..?: మనుషుల్లో స్పందన ఎందుకు కనిపించట్లే..! విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్ ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట 700 మంది మద్దతుదారులతో నిరసన చేపట్టారు. గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్ ఆందోళనకు […]

Written By: , Updated On : February 22, 2021 / 04:17 PM IST
Follow us on

Visakha Collectorate siege

పంచాయతీ సెగ అంటుకుంది. నాలుగో విడతలో అక్రమాలు జరిగాయంటూ జనం రోడ్డెక్కారు. ఏకంగా కలెక్టరేట్ ను ముట్టడించారు. పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఏకంగా విశాఖ కలెక్టరేట్ ను జనం ముట్టడించారు.

Also Read: మానవత్వం మరుస్తున్నారా..?: మనుషుల్లో స్పందన ఎందుకు కనిపించట్లే..!

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్ ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట 700 మంది మద్దతుదారులతో నిరసన చేపట్టారు.

గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్ ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట 700మంది మద్దతుదారులతో నిరసన చేపట్టారు. విశాఖ పట్నం రెవెన్యూ డివిజన్ లోని 130 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే గండిగండం పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఓ వర్గం అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తొలుత రమేశ్ విజయం సాధించారని ప్రకటించి.. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారని.. అనంతరం ప్రత్యర్థి విజయం సాధించినట్లు ధ్రువీకరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Also Read: ఎన్నికల వేళ తమ్ముళ్ల ఆధిపత్య పోరు

కలెక్టర్ ఈ ఎన్నికను రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఏకంగా గ్రామస్థులంతా 700 మంది కలిసి విశాఖ కలెక్టరేట్ ను ముట్టడించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్