దసరా నవరాత్రులు.. గాయత్రి దేవి అలంకరణలో దుర్గమ్మ!

నవరాత్రుల లో భాగంగా ఈ రోజు అనగా సోమవారం మూడు రోజులో భాగంగా అమ్మవారు చంద్ర ఘంటా రూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు ఇంద్రకీలాద్రిపై దర్శన భాగ్యం కల్పించారు. ఈ తొమ్మిది రాత్రులు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలో అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో కొలువై ఉంటారు. ఈ రోజు అమ్మవారు ముదురు ఎరుపు రంగు చీరలో పూజిస్తారు. 10 చేతులను కలిగి దుష్టశక్తులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమ్మవారు పులిపై […]

Written By: Navya, Updated On : October 19, 2020 11:17 am
Follow us on

నవరాత్రుల లో భాగంగా ఈ రోజు అనగా సోమవారం మూడు రోజులో భాగంగా అమ్మవారు చంద్ర ఘంటా రూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు ఇంద్రకీలాద్రిపై దర్శన భాగ్యం కల్పించారు. ఈ తొమ్మిది రాత్రులు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలో అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో కొలువై ఉంటారు. ఈ రోజు అమ్మవారు ముదురు ఎరుపు రంగు చీరలో పూజిస్తారు. 10 చేతులను కలిగి దుష్టశక్తులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమ్మవారు పులిపై స్వారీ చేస్తున్నట్లు దర్శనమిస్తారు.

గాయత్రి దేవి నుదిటిపై నెలవంక చంద్రబింబాన్ని తిలకంగా దిద్ది పూజిస్తారు. ఆ చంద్రుని పూజించటం ద్వారా ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోయి ప్రశాంతతను కల్పిస్తాడు. అందుకు ప్రతీకగానే గాయత్రి దేవి అమ్మవారి ని చంద్ర ఘంటా అని పిలుస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం ద్వారా వారి మనస్సులో ఎలాంటి భయాందోళనలు లేకుండ ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల శక్తిని ఈ అమ్మ వారు ప్రసాదిస్తారు.

నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెసర గారెలు, మినప గారెలు, లేదా మొక్కజొన్న తో చేసిన గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా కార్యక్రమం ముగించుకొని గాయత్రి దేవి స్తోత్రం పఠించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి సర్వ శక్తులను మనకు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నవరాత్రుల లో భాగంగా అమ్మవారి దర్శనార్థం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నవరాత్రులను ఎంతో ఘనంగా, ఉపవాస దీక్షలతో పూజించడం విశేషం. ఈ విధంగా పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.