https://oktelugu.com/

వాట్సాప్ వాడుతున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లలో ఎక్కువ మంది యూజ్ చేసే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. ఇతరులకు సందేశాలు, ఫోటోలు పంపాలంటే ఈ యాప్ ద్వారా సులువుగా పంపడం సాధ్యమవుతుంది. అయితే వాట్సాప్ యాప్ ను ఉపయోగించే వాళ్లు కొన్ని విషయాలపై అవగాహనను ఏర్పరచుకోవాలి. అవగాహన లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాట్సాప్ లో చాలామంది డీపీలను మొబైల్ నంబర్లలోని కాంటాక్ట్ పర్సన్స్ చూసేలా సెట్టింగ్స్ చేసుకుని ఉంటారు. అయితే మనం చాలా సందర్భాల్లో పెద్దగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 15, 2020 / 07:11 PM IST
    Follow us on


    స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లలో ఎక్కువ మంది యూజ్ చేసే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. ఇతరులకు సందేశాలు, ఫోటోలు పంపాలంటే ఈ యాప్ ద్వారా సులువుగా పంపడం సాధ్యమవుతుంది. అయితే వాట్సాప్ యాప్ ను ఉపయోగించే వాళ్లు కొన్ని విషయాలపై అవగాహనను ఏర్పరచుకోవాలి. అవగాహన లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాట్సాప్ లో చాలామంది డీపీలను మొబైల్ నంబర్లలోని కాంటాక్ట్ పర్సన్స్ చూసేలా సెట్టింగ్స్ చేసుకుని ఉంటారు.

    అయితే మనం చాలా సందర్భాల్లో పెద్దగా పరిచయం లేని వాళ్ల నంబర్లను కూడా ఫోన్ లో సేవ్ చేసుకుని ఉంటాం. వాళ్లు మన డీపీలను చూసే అవకాశం ఉండటంతో పాటు కొన్ని సందర్భాల్లో మన ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వాట్సాప్ యాప్ ను వాడే వాళ్లు అనవసరమైన కాంటాక్ట్ లను మొబైల్ ఫోన్ లో ఉంచుకోకపోతే మంచిది. లేదా వాట్సాప్ లో పెద్దగా పరిచయం లేని వాళ్ల కాంటాక్ట్ నంబర్లను బ్లాక్ లో ఉంచితే మంచిది.

    వాట్సాప్ డీపీ అందరికీ కనిపించేలా ఉంచకూడదు. అలా చేస్తే మనకు తెలియని వాళ్లు సైతం ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. వాట్సాప్ లో అనవసరమైన కాంటాక్ట్ లను డిలేట్ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. మనం చాలా సందర్భాల్లో స్టేటస్ లలో అనేక విషయాలను, ఫోటోలను పెడుతూ ఉంటాం. కాంటాక్ట్ నంబర్ సేవ్ చేసుకుంటే ఫోటోలు స్టేటస్ కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.

    అందువల్ల కాంటాక్ట్ ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్సాప్ లో ఎప్పుడూ టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎంచుకోవాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎంచుకోవడం వల్ల మన ఖాతా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. సిమ్ మార్చినా, మన ఫోన్ ను ఎవరైనా దొంగలించినా వాట్సాప్ విషయంలో భయపడాల్సిన అవసరం ఉండదు.