
దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఎంత ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసినా బ్యాటరీ త్వరగా అయిపోతుందని చాలామంది చెబుతూ ఉంటారు. గేమ్స్ ఆడటం, తరచూ వీడియోలు చూడటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పవర్ బ్యాంకుల సహాయంతో తరచూ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉన్నా ఛార్జింగ్ సమస్య మాత్రం వేధిస్తూనే ఉంటుంది.
ఫోన్ స్విఛాఫ్ అయిపోతే అదే సమయంలో పవర్ లేకపోయినా, బయట ఉన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా బ్యాటరీ జీవితకాలంను పెంచుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో జీపీఎస్ లేదా బ్లూటూత్ లను ఆఫ్ చేసుకోవాలి. అవసరమైన సమయంలో మాత్రమే వాటిని వినియోగించడం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ఫోన్ బ్రైట్ నెస్ ను తగ్గించుకోవడం వల్ల ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉంటుంది.
బ్రైట్ నెస్ ను ఎంత తగ్గించుకుంటే బ్యాటరీని అంత సేవ్ చేయడం సాధ్యమవుతుంది. అవసరమైన సమయంలో మాత్రమే బ్రైట్ నెస్ ను పెంచుకుంటే సరిపోతుంది. యాప్స్ ను వినియోగించిన తరువాత వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలి. బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ తొలగించడం వల్ల బ్యాటరీ లైఫ్ టైమ్ సులువుగా పెరుగుతుంది.
ఆవేస్ ఆన్ డిస్ ప్లే ఫీచర్ ను ఫోన్ లో ట్రన్ ఆఫ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ టైమ్ ను సులువుగా పెంచుకోవచ్చు. యానిమేటెడ్ గ్రాఫిక్స్ ను, వాల్ పేపర్స్ ను, విడ్జెట్స్ ను ఉపయోగించకపోవడం ద్వారా కూడా బ్యాటరీ లైఫ్ టైమ్ ను సులువుగా పెంచుకునే అవకాశం ఉంటుంది.