
‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాలోనే అలాంటి కథలో నటించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి సాహసోపేతమైన కథలో నటించాలంటే నిజంగానే గట్స్ కావాలి. ధైర్యంగా ఒప్పుకొని సినిమాలో బాగా నటించి మెప్పు పొందాడు.
అయితే కొత్త హీరో, తొలి చిత్రం కావడంతో మెగా హీరో వైష్ణవ్ కు రెమ్యూనరేషన్ కూడా అంతంతమాత్రంగానే ఇచ్చారన్నది టాలీవుడ్ టాక్. తొలి ‘ఉప్పెన’ సినిమాకు గాను వైష్ణవ్ తేజ్ అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమేనని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
ఇక ఉప్పెన సినిమాకు ముందే పాపం వైష్ణవ్ తేజ్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలియక ‘క్రిష్’ సినిమా ఒప్పుకున్నాడట.. దానికి రూ.75 లక్షల పారితోషికం తీసుకున్నాడట..
అయితే తాజాగా ఉప్పెన్ బంపర్ హిట్ కొట్టడంతో ఈ మెగా హీరో తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట.. ‘భోగవిల్లి ప్రసాద్’ నిర్మాణంలో వస్తున్న సినిమాకు ఓకే చెప్పిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాకు గాను ఏకంగా ‘రెండున్నర రెట్లు’ రెమ్యూనరేషన్ తీసుకుంటుండడం గమనార్హం. అంటే ఉప్పెనతో మన హీరో గారి పారితోషికం ఏకంగా ఐదు రెట్లు పెరిగిందనే చెప్పొచ్చు.