
దీపావళి పండుగ అంటే కారు చీకటిని పారద్రోలి జగమంతా వెలుగులతో నింపే ఈ పండుగను చిన్నవయసు వారి నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ దీపావళి పండుగను విజయానికి ప్రతీకగా అన్ని ప్రాంతాల వారు, కుల మత భేదం లేకుండా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి జరుపుకుంటారు.
Also Read: కార్తీక మాసమంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు అంటే ఆశ్వయుజ మాసం బహుళ చతుర్దశి రోజున నరక చతుర్దశి గా జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరు నూతన వస్త్రాలతో పిండివంటలతో ఆ లక్ష్మీదేవిని పూజించి, ఈ పండుగకు ప్రతీకగా బాణాసంచా పేలుళ్ళతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ నెల 15వ తేదీన అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి రోజున ఆ లక్ష్మీదేవి పూజలు కేవలం ఆశ్వీయుజ అమావాస్య రాత్రివేళ ఉన్న గడియల లో మాత్రమే లక్ష్మి పూజను జరుపుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి నిత్యం సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు తెలియజేస్తున్నారు.
Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?
ఈ పండుగను కేవలం హిందువులు మాత్రమే కాకుండా మతాలకతీతంగా ఒక వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగకు కూతుళ్లు, అల్లుళ్లు ను ఆహ్వానించి వారికి విలువైన కానుకలతో గౌరవిస్తారు. ఈ పండుగ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఈ పండుగను జరుపుకోవడానికి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ఈ పండుగను విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. అటువంటి ఈ విజయాలను మన జీవితంలోకి చీకటిని చీల్చుకుని వెలుగును నింపుతూ రావాలని దీపావళి రోజున బాణాసంచాలు కాలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.