https://oktelugu.com/

ఏపీ ఖజానాను మందుబాబులే ఆదుకుంటున్నరు

తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం అమలు చేసేందుకే ప్రయత్నాలు సాగించారు. కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మాత్రం ఆ మందుబాబులే ఇప్పుడు ఆదుకుంటున్నారనడంలో ఎలాంటి ఆలోచన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ మందుబాబులు మాత్రం ఇతోధికంగా ప్రభుత్వ ఖజానాకు హెల్ప్‌గా నిలుస్తున్నారు. రాష్ట్రంలో మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నా.. తమ […]

Written By: Srinivas, Updated On : March 30, 2021 10:29 am
Follow us on

Liquor Sales in Andhra Pradesh
తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం అమలు చేసేందుకే ప్రయత్నాలు సాగించారు. కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మాత్రం ఆ మందుబాబులే ఇప్పుడు ఆదుకుంటున్నారనడంలో ఎలాంటి ఆలోచన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ మందుబాబులు మాత్రం ఇతోధికంగా ప్రభుత్వ ఖజానాకు హెల్ప్‌గా నిలుస్తున్నారు. రాష్ట్రంలో మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నా.. తమ సంపాదనలో నుంచి పన్ను మాత్రం కడుతున్నారు.

గతేడాది మందు బాబులు కట్టిన పన్నులు రూ.20 వేల కోట్ల వరకూ ఉంటాయి. పదకొండు నెలల్లోనే ఈ మొత్తం రూ. పద్దెనిమిది వేల కోట్ల వరకూ ఉంది. ఎలా లేదన్నా.. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వ ఖజానాకు మందు బాబులు రూ.ఇరవై వేల కోట్లు జమ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాక ముందు ఈ మొత్తం కేవలం రూ.ఏడు వేల కోట్లు ఉండేది. ఇప్పుడిది మూడింతలు పెరిగింది. మద్యం అలవాటును మానిపించడానికి ధరలను షాక్ కొట్టిస్తామని ముందుగానే చెప్పిన సీఎం జగన్ ఆ మేరకు రేట్లు పెంచుకుంటూ పోయారు.

లాక్‌డౌన్ తర్వాత ధరలను రెండింతలు చేశారు. అయినా.. మందుబాబులు మాత్రం ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానుకోలేదు. ప్రభుత్వానికి వచ్చే వివిధ రకాల ఆదాయం పడిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పది వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కానీ.. ఎక్సైజ్ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. దీంతో చాలావరకు కవర్ అయింది. అందుకే మందు బాబుల పట్ల ప్రభుత్వం కూడా కాస్త కనికరం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత బ్రాండ్లన్నింటికీ మళ్లీ అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ దీనికి సంబంధించి టెండర్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని సైతం నియమించింది. వాస్తవానికి ఏపీలో ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రముఖ బ్రాండ్ల స్మగ్లింగ్ జరుగుతోంది. దీన్ని అరికట్టడం ఎస్‌ఈబీకి కూడా సాధ్యం కావడం లేదు. వీటన్నింటినీ అధిగమించి ప్రభుత్వానికి మరింత ఆదాయం సంపాదించుకునేలా చేయగలగాలంటే.. ప్రముఖ బ్రాండ్లకుపర్మిషన్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో మద్య నిషేధం మాటలకే పరిమితం అనేది సుస్పష్టం.