https://oktelugu.com/

చిత్రసీమ ఫై కరోనా పంజా

ప్రపంచ దేశాల్ని వణికించేస్తున్న కరోనా వైరస్.సినెమా రంగం ఫై కూడా తన ప్రభావాన్ని బాగా చూపుతోంది. రెండు మూడు వారాల ముందు వరకు కరోనా వైరస్ గురించి సీరియస్ గా తీసుకొని ఇండియన్స్.. ఇప్పుడు దేశంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో హడలి పోతున్నారు.ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 50 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ఈ కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక దక్షిణాదిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 11, 2020 / 06:26 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాల్ని వణికించేస్తున్న కరోనా వైరస్.సినెమా రంగం ఫై కూడా తన ప్రభావాన్ని బాగా చూపుతోంది. రెండు మూడు వారాల ముందు వరకు కరోనా వైరస్ గురించి సీరియస్ గా తీసుకొని ఇండియన్స్.. ఇప్పుడు దేశంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో హడలి పోతున్నారు.ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 50 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది.

    దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ఈ కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక దక్షిణాదిన కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది కేరళలోఅనే చెప్పాలి… ఇటలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం ఏ పరిమితులు పెట్టుకోకుండా కొన్ని రోజుల పాటు ఎక్కడ పడితే అక్కడ తిరిగేయడంతో కరోనా వైరస్ కేరళలో స్ప్రెడ్ అయ్యింది.. కేరళలో కరోనా వైరస్ బాధితులు రెండంకెల సంఖ్యలో ఉన్నారని కూడా తెలుస్తోంది.
    ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. పలు ఆంక్షలు విధించింది. దాంతో జనాలు బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు. అదే క్రమంలో కేరళ వ్యాప్తంగా థియేటర్లు మూసేయడానికి నిర్ణయం జరిగింది. దరిమిలా మార్చి 31 వరకు కేరళ వ్యాప్తంగా థియేటర్లన్నీ మూతబడుతున్నాయి.

    కొచ్చిలో జరిగిన మలయాళ సినీ సంస్థల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు చాలా వరకు మూసేశారు. షాపింగ్ మాల్స్ కూడా పాక్షికంగానే నడుస్తున్నాయి.

    అసలే అన్ సీజన్, దానికి తోడు పుండు మీద పుట్ర లా కరోనా దెబ్బ. ఇలాంటి విపత్కర సమయంలో అంతంత మాత్రం కలెక్షన్ లతో థియేటర్లు నడపడం కంటే మూసివేయడం మంచిదన్న నిర్ణయానికి కేరళ సినీ సంఘాలు వచ్చాయి. ఐతే నెలాఖరు తరవాత కూడా కరోనా ప్రభావం ఉండే టట్లయితే . బంగారం లాంటి వేసవి సీజన్లో సినిమాల సంగతి ఏమవుతుందో అని సినీ జనాలు అందరూ భయపడుతున్నారు.
    Prevention is better than cure