భయంలో చంద్రబాబు.. ప్రతిపక్షం టీడీపీ కాదా?

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. సొంత రాష్ట్రాన్ని విడిచి ఇంతకాలం ఎప్పుడూ దూరంగా ఉండలేదట.. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. వృద్ధాప్యం మీదపడడం.. కరోనాకే అదే ఇష్టం కావడంతో చంద్రబాబు కాలు బయటపెట్టడం లేదు. ఇక చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు.. నవ యువకుడు లోకేష్ బాబు కూడా గడప దాటడం లేదు. దీంతో ఏపీలో ప్రతిపక్షం అన్న టీడీపీ పాత్ర కనుమరుగు అవుతోందని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. […]

Written By: NARESH, Updated On : August 20, 2020 12:13 pm
Follow us on


40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. సొంత రాష్ట్రాన్ని విడిచి ఇంతకాలం ఎప్పుడూ దూరంగా ఉండలేదట.. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. వృద్ధాప్యం మీదపడడం.. కరోనాకే అదే ఇష్టం కావడంతో చంద్రబాబు కాలు బయటపెట్టడం లేదు. ఇక చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు.. నవ యువకుడు లోకేష్ బాబు కూడా గడప దాటడం లేదు. దీంతో ఏపీలో ప్రతిపక్షం అన్న టీడీపీ పాత్ర కనుమరుగు అవుతోందని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు.

Also Read: విశాఖ లోని ఆ ఇంట్లోనే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంతా…! జగన్ దూకుడూ మామూలుగా లేదు

కరోనా వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తెగ భయపడిపోతున్నాడు. హైదరాబాద్ ను వీడి అమరావతి మొహం చూడడం లేదు. ఆ మధ్య అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా చంద్రబాబు లోకేష్ బాబు లు అలా వచ్చి ఇలా వెళ్లారు. లోకేష్ మాత్రం ధైర్యం చేసి జేసీ, అచ్చెన్న ఫ్యామిలీలను పరామర్శించి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక అమరావతిలో ఒకసారి చంద్రబాబు కనిపించి ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు.

ప్రస్తుతం చంద్రబాబు జూమ్ కెమెరాతో.. లోకేష్ ట్విట్టర్ తో ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా క్షేత్రస్థాయిలోకి రావడం లేదు. కరోనాతో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్ష రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీ దూరమైపోయిందన్న అపవాదును మూటగట్టుకుంటోంది.

అదే సమయంలో ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కాగానే ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా సోము వీర్రాజు స్పందించి వెళ్లిపోతున్నారు. రమేశ్ ఆస్పత్రి దుర్ఘటన చోటకు వెళ్లి పరామర్శించారు. ఇక వరదలు వచ్చి మునిగితే గోదావరి జిల్లాలకు వెళ్లి ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని నినదించారు. ఏ సమస్య తలెత్తినా అక్కడికెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Also Read: బాబుపై కేసు… జగన్ కు మరో అస్త్రమేనా?

నిజానికి సోము వీర్రాజు వయసు కూడా 60 ఏళ్లు దాటింది. కానీ ఆయన చురుకుగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ చంద్రబాబు లేని లోటును భర్తీ చేస్తున్నారు. దూకుడుగా వెళుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడు ఇలాగే కొనసాగితే ఏపీలో టీడీపీని ప్రతిపక్షంగా మరిచిపోయి బీజేపీని చూస్తారని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారట.. చంద్రబాబుకు కరోనా భయం ఎప్పుడు పోతుందా? ఆయన ఎప్పుడొస్తారో తెలియక తమ్ముళ్లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.