కరోనా దాడి: వెస్టిండీస్-ఆస్ట్రేలియా సిరీస్ రద్దు?

వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డేపై కరోనా దాడి చేసింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్ని క్షణాల ముందు ఇలా మ్యాచ్ రద్దు చేయాల్సి రావడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. వర్షం వల్లనో.. వాతావరణం సరిగా లేకనో ఇన్నాళ్లు మ్యాచ్ రద్దు అయ్యేది. కానీ ఇప్పుడు కరోనా దాడితో రద్దు కావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. రెండు జట్ల మధ్య ఇప్పటికే టీ20 సిరీస్ ముగిసింది. […]

Written By: NARESH, Updated On : July 24, 2021 11:14 am
Follow us on

వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డేపై కరోనా దాడి చేసింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్ని క్షణాల ముందు ఇలా మ్యాచ్ రద్దు చేయాల్సి రావడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. వర్షం వల్లనో.. వాతావరణం సరిగా లేకనో ఇన్నాళ్లు మ్యాచ్ రద్దు అయ్యేది. కానీ ఇప్పుడు కరోనా దాడితో రద్దు కావడం ఇదే తొలిసారి అని అంటున్నారు.

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. రెండు జట్ల మధ్య ఇప్పటికే టీ20 సిరీస్ ముగిసింది. వన్డేలు ప్రారంభమయ్యాయి. తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓడిపోయింది. రెండో వన్డేకు సిద్ధమవుతుండగా ఆటగాళ్లు స్టేడియంలోకి వచ్చి మరీ వెనక్కి వెళ్లిపోయారు.

వెస్టిండీస్ జట్టులోని సహాయక సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. బ్రిడ్జిటౌన్ లో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని క్షణాల ముందు ఇలా మ్యాచ్ ను రద్దు చేయడంతో అంతా షాక్ అయ్యారు.

సపోర్టింగ్ స్టాఫ్ తో కాంటాక్ట్ అయిన ఆటగాళ్లు ఇతరుల గురించి ఆరాతీసి అందరినీ ఐసోలేషన్ లోకి పంపిస్తున్నారు.

క్రికెటర్లను ఐసోలేషన్ లోకి పంపారు. ఆటగాళ్ల కు కరోనా సోకకుండా ఏర్పాటు చేసిన బయోబబుల్ ఫెయిల్ అయినట్టుగా భావిస్తున్నారు.ఈ పరిణామాలతో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య మ్యాచ్ లు రద్దు అయినట్టేనని అంటున్నారు. ఆటగాళ్లు బస చేసిన హోటళ్లలోనే క్వారంటైన్ కు వెళ్తారని సమాచారం. దీంతో ఇక ముందు ముందు మ్యాచ్ లు జరిగే అవకాశం లేదంటున్నారు. ఈ సిరీస్ రద్దు అయినట్టేనని చెబుతున్నారు.