
దేశంలో మేనరికపు పెళ్లిళ్లపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొందరు మేనరికపు పెళ్లిళ్లను సమర్థిస్తే మరి కొందరు మాత్రం మేనరికపు పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. రక్త సంబంధీకుల మధ్య వివాహం జరిగితే పుట్టబోయే పిల్లల్లో అంగ వైకల్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఒక ముఖ్యమైన కారణం ఉంది.
సూక్ష్మంగా చెప్పాలంటే పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి నుంచి 23 క్రోమోజోములు తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయి. ఈ క్రోమోజోములు పిల్లలకు వేర్వేరు అంశాలకు సంబంధించిన సమాచారం చేరవేస్తాయి. దంపతులు ఇద్దరూ రక్త సంబంధీకులు కాని పక్షంలో తండ్రిలో ఒక జన్యువులో లోపం ఉంటే తల్లిలోని మరో జన్యువు ఆ లోపాన్ని భర్తీ చేయడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.
ఇద్దరూ ఒకే కుటుంబాలకు చెందిన వారైతే ఇద్దరిలో సమాచార లోపం ఉంటే ఆ లోపాన్ని అధిగమించేందుకు జన్యువు ఏదీ లేకపోవడం వల్ల పుట్టిన బిడ్డలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మేనరికపు వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది. లేకపోతే పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
కొంతమంది మేనరికపు వివాహం చేసుకున్నా జన్యువుల్లో ఎటువంటి లోపం లేకపోతే మాత్రం పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉంటాయి. పెద్దలు కూడా తమ పిల్లలకు మేనరికపు వివాహం జరిపించాలని అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మంచిది.