దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలకు ముందు తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడిచింది. గత ఆరేళ్లుగా తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కారుకు స్పీడుకు కమలదళం బ్రేక్ వేసింది. దీంతో సీఎం కేసీఆర్ బీజేపీపై కన్నెర్ర చేశారు. ఈక్రమంలోనే డిసెంబర్ 8న రైతులు ఇచ్చిన బంద్ సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు.
భారత్ బంద్ సాక్షిగా సీఎం కేసీఆర్ కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు హడావుడి చేశాయి. బంద్ సందర్భంగా ఓ ఎమ్మెల్యే ఓవర్ రియాక్ట్ అయి ఓ వ్యక్తి పై చేయిచేసుకోవడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. బంద్ తర్వాత సీఎం కేసీఆర్ సడెన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు.. ప్రధాని మోదీతో భేటి అయి వచ్చారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కొద్దిరోజులుగా నిరసనలు చేస్తున్న రైతు సంఘాలతో ఆయన భేటి అవుతారని.. వారి ఆందోళనకు సంఘీభావం తెలుపారనే ప్రచారం జరిగింది. తీరా చూస్తే కేసీఆర్ ఢిల్లీ టూరు ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర మంత్రులు అమిత్ షా.. గజేంద్రసింగ్ షెకావత్.. హర్‌దీప్‌సింగ్ పూరి తదితరుల చుట్టూనే తిరిగింది.
రైతుల ఆందోళనలు న్యాయమైనవే వారికి తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించిన కేసీఆర్ ప్రకటించారు. అవసరైతే రిజనల్ పార్టలతో కలిసి రైతులకు మద్దతుగా పోరాడుతామన్నారు. అయితే ఢిల్లీ దాకా వెళ్లిన కేసీఆర్ రైతుల ఆందోళనలకు ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ తెలంగాణలో ఓ మాట.. ఢిల్లీ ఓ మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లికి కనీసం వారికి మద్దతు తెలుపకపోవడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. కేంద్రం తెలంగాణ జోలికి వస్తే.. తాము కేంద్రం జోలికి వస్తామనే సంకేతాలను కేసీఆర్ పంపినట్లు కన్పిప్తోంది.
ఇక కొద్దిరోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతుల ఆందోళనలకు బహిరంగంగా మద్దతు తెలుపుతారా? లేదా కేంద్రం వైపు మొగ్గుచూపుతారా? అనేది రాజకీయవ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.