చిరు-152వ మూవీ కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెల్సింది. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. చిరు జోడీకి త్రిష నటిస్తుంది. చిరు-152వ సినిమా టైటిల్ పై అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ ఓ సినిమా వేడుకలో మూవీ టైటిల్ ‘ఆచార్య’ అని ప్రకటించేశాడు. దీంతో అక్కడున్న అభిమానులు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఇటీవల తరుచూ వెళుతున్నారు. నిన్న ‘పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. చిరంజీవి తన కెరీర్ విషయాలను అందరికీ చెప్పారు. ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే చిరంజీవి నోరు జారారు. కొరటాల శివతో చేస్తున్న సినిమా ‘ఆచార్య’ అని స్టేజీపైనే అనౌన్స్ చేశాడు. పొరపాటు గ్రహించిన చిరంజీవి కొంచెం గ్యాప్ తీసుకుని దర్శకుడు కొరటాలకు క్షమాపణలు చెప్పారు.
టైటిల్ విడుదల చేసే విషయంలో కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు. సినిమా పేరు అనుకోకుండా చెప్పేశానని మెగాస్టార్ చెప్పారు. అయితే కొన్ని గొప్ప వార్తలు నోట్లో ఎక్కువ కాలం ఆగవని బదులిచ్చాడు. ఏదేతేనే చిరు-152 టైటిల్ ‘ఆచార్య’ బయటకి రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘ఆచార్య’ మూవీని రాంచరణ్ మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.