https://oktelugu.com/

చిరంజీవి నయా లుక్.. అభిమానులు ఖుషీ

మెగాస్టార్ చిరంజీవి లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు కన్పిస్తుంది. లాక్డౌన్ అందరూ ఇంట్లో ఉండటంతో హీరోహీరోయిన్లంతా బరువు పెరిగిపోతుంటే చిరంజీవి మాత్రం చాలా ఫిట్ గా మారారు. ప్రస్తుతం చిరంజీవికి 64ఏళ్లంటే నమ్మడం కష్టమే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా దిగిన ఫొటోలు చిరంజీవి ఫిట్నెస్ కు అద్ధం పడుతున్నాయి. చిరంజీవి నయా లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను మెగాస్టార్ అభిమానులతోపాటు కేసీఆర్ అభిమానులు సోషల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 23, 2020 / 12:16 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు కన్పిస్తుంది. లాక్డౌన్ అందరూ ఇంట్లో ఉండటంతో హీరోహీరోయిన్లంతా బరువు పెరిగిపోతుంటే చిరంజీవి మాత్రం చాలా ఫిట్ గా మారారు. ప్రస్తుతం చిరంజీవికి 64ఏళ్లంటే నమ్మడం కష్టమే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా దిగిన ఫొటోలు చిరంజీవి ఫిట్నెస్ కు అద్ధం పడుతున్నాయి. చిరంజీవి నయా లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను మెగాస్టార్ అభిమానులతోపాటు కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రభినయం చేస్తున్నారు. ఇందులో రాంచరణ్ కీరోల్ చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. లాక్డౌన్ వల్ల షూటింగులు వాయిదా పడటంతో చిరంజీవి ఇంటికే పరిమితమయ్యారు. ఓవైపు ‘సీసీసీ మనకోసం’ పనులు చక్కబెడుతూ మరోవైపు చిరంజీవి ఫిట్నెస్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే జిమ్ చేస్తూ చిరంజీవి తన వయస్సును సగానికి తగ్గించుకున్నట్లు కన్పిస్తుంది. మెగాస్టార్ చాలా ఫిట్ గా, యంగ్ హీరో మాదిరిగా మారిపోయారు. ‘సైరా’లో కన్పించిన చిరంజీవేనా అన్నట్లుగా మెగాస్టార్ మారిపోయారు. ‘ఆచార్య’లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల కోసమే చిరంజీవి ఇలా మారినట్లు తెలుస్తోంది. తాజాగా కేసీఆర్‌తో మీటింగ్‌కు వచ్చిన చిరంజీవిని చూసి అంతా షాక్ అయ్యారు. కేసీఆర్ పక్కన చిరంజీవి నయా లుక్ అదిరిపోయిందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.