
కరోనా కల్లోలం వేళ టాలీవుడ్ ట్రెండ్ మారుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఈ కరోనా టైంలో థియేటర్లకు జనాలు రాక.. చూడక నష్టాలు తెచ్చుకునే బదులు.. చిన్న బడ్జెట్ తో మంచి కథతో సినిమా తీసి అంతకు మూడు రెట్లు లాభాలకు అమ్ముకోవాలని నిర్మాణ సంస్థలు స్కెచ్ గీస్తున్నాయి.
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన యూవీ క్రియేషన్స్ ఇప్పుడు ఆ కాడి వదిలేసింది. ఈ టైంలో అలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తీసి ప్రేక్షకులు రాక చేతులు కాల్చుకోకుండా చిన్న దర్శకులు, క్రియేటివిటీ గల వారితో చిన్న చిత్రాలు నిర్మిస్తూ భారీ లాభాలకు అమ్ముకుంటోంది.
ఇటీవలే యూవీ క్రియేషన్స్ కేవలం 2.50 కోట్లతో తీసిన ‘ఏక్ మినీ కథ’ మూవీని ఏకంగా 9 కోట్లకు అమెజాన్ కు అమ్మి సొమ్ము చేసుకుంది. యూవీకి ఉన్న బ్రాండ్ వాల్యూతో ఈ రేటు వచ్చింది. సాహో లాంటి పాన్ ఇండియా మూవీని తీసిన యూవీ క్రియేషన్స్ ఇలాంటి చిన్న సినిమాలతో ఇప్పుడు మూడు రెట్ల లాభాలు పొందుతోంది.
ఇదేదో వర్కవుట్ అవుతుండడంతో ఇప్పుడు దర్శకుడు మారుతితో ఇదే ‘ఏక్ మినీ కథ’ హీరో సంతోష్ ను పెట్టి 30 రోజుల్లో రెండు కోట్లతో మరో సినిమా తీస్తున్నారట.. దీనికి ఆహా ఓటీటీ భారీ ఆఫర్ ఇచ్చిందని.. మూడు రెట్ల లాభాలు ఖాయమని అంటున్నారు. అయితే ఇందులో దర్శకుడు మారుతికి బాగానే ఇస్తారని.. వాటి పెట్టారని తెలిసింది. ఇలా కరోనా కల్లోలంలోనూ యూవీ నిర్మాతలు చిన్న సినిమాలతో క్యాష్ చేసుకుంటున్నారు.