
‘రేణు దేశాయ్’ ఈ మధ్య మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహంగా ఉందట. ముందుగా మంచి పాత్రలే చేయాలని ఆమె నిర్ణయించుకుందట. సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో బలమైన పాత్రలు చేసినప్పుడే.. కెరీర్ కి పునాది బాగా పడుతుందని.. అందుకే మంచి పాత్రల వచ్చేలా రేణు ప్లాన్ చేసుకుంటుందట. ఇక ఇప్పటికే పలు తెలుగు టీవీ షోలలో హోస్ట్ గా కూడా బిజీగా ఉంది రేణు దేశాయ్. పైగా ఆమె ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేస్తోంది.
మరోపక్క తన పిల్లలను మెగా ఫ్యామిలీకి దగ్గర చేయడానికి హైదరాబాద్ లోనే ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలతోనూ బిజీగా ఉన్నాడు. ఎలాగూ అకీరా కూడా యాక్టింగ్ పై ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి, తనకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేలా రేణు దేశాయ్ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తుంది. మెగా ఫ్యామిలీ కూడా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ‘పవన్ – రేణు’ పిల్లలను పిలవకుండా తమ ఫంక్షన్ ను చేయడం లేదు. పైగా అకీరాను మరో రెండేళ్ల తర్వాత హీరోగా లాంచ్ చేసే బాధ్యతను రామ్ చరణ్ తీసుకున్నాడట.
చరణ్ ఇప్పటినుండే పవన్ వారసుడిని యాక్టింగ్ మాస్టర్ వైజాగ్ సత్యానంద్ దగ్గరకి పంపాలని అనుకుంటున్నాడట. ఇక రేణు దేశాయ్ పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత, మళ్ళీ పెళ్లి చేసుకొవడానికి ప్రయత్నాలు చేసింది. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అలాగే పెళ్లి కూడా చేసుకుందని రూమర్స్ అయితే వచ్చాయి గాని, ఈ వార్త పై క్లారిటీ మాత్రం రాలేదు. మరి మళ్ళీ యాక్టింగ్ పై ఆసక్తి చూపిస్తోన్న రేణుకు మంచి క్యారెక్టర్స్ దొరుకుతాయా ? దొరికిన ఆమె బిజీ ఆర్టిస్ట్ గా మారుతుందా ? చూడాలి.